యంగ్ లీడ్ డైరెక్టర్-బాబీ

- August 01, 2025 , by Maagulf
యంగ్ లీడ్ డైరెక్టర్-బాబీ

తెలుగు తెర పై ఎందరో స్క్రీన్ రైట‌ర్స్ దర్శకులుగా మారారు...వారిలో బాబీ ఒకరు. సినిమా మీదున్న ప్రేమే ఈ గుంటూరు చిన్నోడిని, భాగ్యనగరానికి రప్పించింది.సినిమాల్లో నిలదొక్కుకోవడానికి చేయాల్సిన పనులన్నీ చేసి..రైటింగ్ విభాగంలో కుదురుకున్న బాబీ... అక్కడి నుంచి మాస్ మహారాజా రవి తేజలోని పవర్ చూపించి ఇండస్ట్రీలో స్థిరపడ్డారు.నేడు యుంగ్ లీడ్ డైరెక్టర్ బాబీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం...

 బాబీ కొల్లి అలియాస్ కె.ఎస్ ర‌వీంద్ర 1983, ఆగస్టు 1న గుంటూరులో జన్మించాడు.అక్కడే బీకామ్ పూర్తి చేసి సినిమా రంగమే లోకంగా బ్రతుకుతూ భాగ్యనగరానికి అడుగుపెట్టారు. స్క్రీన్ రైట‌ర్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన బాబీ దర్శకులైన దశరథ్, మలినేని గోపిచంద్ వద్ద కొద్దీ కాలం పనిచేసిన త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా వ‌చ్చిన ప‌వ‌ర్ సినిమాతో డైరెక్ట‌ర్ గా మారాడు.ఆ సినిమా మంచి హిట్ అవ‌డంతో బాబీకి త‌ర్వాత డైరెక్ట‌ర్ గా వెనుక‌డుగేయాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. బాబీ ద‌ర్శ‌కుడిగా మారాక 6 సినిమాలు చేశాడు.

ప్ర‌తీ సినిమాతో త‌న‌దైన మార్క్ వేసుకున్న బాబీ రెండేళ్ల కింద‌ట మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీర‌య్య సినిమా తీసి బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు.ఈ సంవత్సరం సంక్రాంతికి బాల‌య్య‌తో డాకు మ‌హారాజ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన బాబీ మ‌రో హిట్‌ను త‌న ఖాతాలో వేసుకున్నాడు. స్టార్ హీరోలను డైరెక్ట్ చేస్తూ త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు బాబీ.

తాను చేసిన ప్ర‌తీ సినిమా నుంచి ఏదొక కొత్త విష‌యాన్ని నేర్చుకుంటూనే ఉంటాన‌ని చెప్పాడు. డాకు మ‌హారాజ్‌లో బాల‌య్య‌ను కొత్తగా ప్రెజెంట్ చేయాల‌ని మొద‌టి నుంచి అనుకున్నాన‌ని, ఆ ఆలోచ‌న‌తోనే ప్ర‌తీ సీన్‌ను కొత్త‌గా రాశాన‌ని, సినిమా రిలీజ‌య్యాక ఆడియ‌న్స్ అభినందిస్తుంటే ఎంతో సంతోష‌మేసింద‌ని ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.ప్రస్తుతం చిరంజీవితో ఒక చిత్రం చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. 

--డి.వి.అరవింద్ (మా గల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com