ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్‌ విడుదల..

- August 01, 2025 , by Maagulf
ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్‌ విడుదల..

న్యూ ఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్, కౌంటింగ్ జరగనుంది. ఆ రోజు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్, ఆ తరువాత ఫలితాలు వెల్లడి కానున్నాయి.ఈ మేరకు ఈనెల 7వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది.ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఈ నెల 21 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది.ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 25వ తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

షెడ్యూల్ ఇలా..
ఆగస్టు 7 : ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ రిలీజ్
ఆగస్టు 21 : నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ
ఆగస్టు 22 : నామినేషన్ల పరిశీలన
ఆగస్టు 25 : నామినేషన్ల ఉపసంహరణ
సెప్టెంబర్ 9 : పోలింగ్, కౌంటింగ్

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com