ఆగస్టు నెలలో 15 రోజులు బ్యాంకులు బంద్..
- August 01, 2025
ముంబై: 2025 ఆగస్టు నెలలో బ్యాంకులకు జాతీయ, ప్రాంతీయ పండుగలు,రెండో, నాలుగో శనివారాలు, ఆదివారాలతో కలిపి మొత్తం 15 రోజుల వరకు సెలవులు ఉన్నాయి.అయితే,ఈ సెలవులన్నీ అన్ని రాష్ట్రాలకు వర్తించవు. మీ ప్రాంతాన్ని బట్టి సెలవులు మారవచ్చు.
ఆగస్టు నెలలో బ్యాంక్ సెలవుల పూర్తి జాబితా:
• ఆగస్టు 3 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు.
• ఆగస్టు 8 (శుక్రవారం): టెండాంగ్ లో రమ్ ఫట్ పండుగ సందర్భంగా సిక్కిం, ఒడిశాలో బ్యాంకులు మూసి ఉంటాయి.
• ఆగస్టు 9 (శనివారం): రెండో శనివారం సెలవు. దీనితో పాటు, రక్షా బంధన్ సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలలో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.
• ఆగస్టు 10 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు.
• ఆగస్టు 15 (శుక్రవారం): స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూసి ఉంటాయి.ఇది జాతీయ సెలవుదినం.
• ఆగస్టు 16 (శనివారం): జన్మాష్టమి కారణంగా కొన్ని రాష్ట్రాలలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.
• ఆగస్టు 17 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు.
• ఆగస్టు 19 (మంగళవారం): మహారాజా బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ పుట్టినరోజు సందర్భంగా త్రిపురలో బ్యాంకులు మూసి ఉంటాయి.
• ఆగస్టు 23 (శనివారం): నాలుగో శనివారం సెలవు.
• ఆగస్టు 24 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు.
• ఆగస్టు 25 (సోమవారం): శ్రీమంత శంకరదేవుని తిరుభావ తిథి నేపథ్యంలో అసోంలో బ్యాంకులకు సెలవు.
• ఆగస్టు 27 (బుధవారం): గణేష్ చతుర్థి సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, గుజరాత్, గోవా ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు.
• ఆగస్టు 31 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సాధారణ సెలవు.ముఖ్యమైన బ్యాంకింగ్ పనులు ఉన్నవారు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకొని ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ మరియు ఏటీఎం సేవలు సెలవు రోజుల్లో కూడా అందుబాటులో ఉంటాయి.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!