గ్రీన్ మొబిలిటీ..ఖతార్ లో 300 ఫాస్ట్ EV ఛార్జింగ్ పాయింట్లు..!!

- August 01, 2025 , by Maagulf
గ్రీన్ మొబిలిటీ..ఖతార్ లో 300 ఫాస్ట్ EV ఛార్జింగ్ పాయింట్లు..!!

దోహా: ఖతార్ వ్యాప్తంగా 300 కంటే ఎక్కువ ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు.EV మౌలిక సదుపాయాల విస్తరణకు ఇది దోహదం చేయనుంది. దాంతో కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయని ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ కార్పొరేషన్ (కహ్రామా) వెల్లడించింది.అల్ తుమామాలోని కహ్రామా అవేర్‌నెస్ పార్క్‌లో కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిక్ వెహికల్ (EV) యజమానులు, ఔత్సాహికులు పాల్గొన్నారు. ఖతార్‌లో EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల భవిష్యత్తు గురించి చర్చించారు. 

ఈ కార్యక్రమంలో కహ్రామాలోని పరిరక్షణ, ఇంధన సామర్థ్య విభాగం డైరెక్టర్ రషీద్ హుస్సేన్ అల్-రహిమి మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా 300 కి పైగా వేగవంతమైన EV ఛార్జర్‌లను వ్యూహాత్మకంగా ఇన్‌స్టాల్ చేసినట్టు వెల్లడించారు.ఈ ఛార్జర్‌లు పెరుగుతున్న EV వినియోగదారులకు మద్దతు ఇస్తున్నాయని తెలిపారు.కస్టమర్ల ఛార్జింగ్ పురోగతిని ట్రాక్ చేయడానికి, నోటిఫికేషన్‌లను స్వీకరించడానికి, రియల్ టైమ్ డేటాను యాక్సెస్ చేయడానికి కహ్రామ EV ఛార్జింగ్ మొబైల్ అప్లికేషన్‌ను తీసుకొచ్చినట్లు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com