రాచకొండ సెక్యూరిట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రెండోవిడత ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్

- August 02, 2025 , by Maagulf
రాచకొండ సెక్యూరిట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రెండోవిడత ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్

హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్ లోని పోలీసు సిబ్బంది మొత్తం ఆరోగ్యంగా ఉండాలని, వారికి ఎలాంటి సమస్యలు ఉన్నా గుర్తించి ముందస్తుగా చికిత్స చేయించుకోవాలని రాచకొండ సిపి సుధీర్ బాబు ఐపిఎస్ అన్నారు.దీని కోసం రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ వారిచే ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతోందని ఆయన అన్నారు.సిబ్బంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ముందస్తుగా చికిత్స తీసుకోవాలని కోరడం జరిగింది.మే నెలలో మల్కాజిగిరి జోన్ సిబ్బందికి మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అంబర్పేట్ హెడ్ క్వార్టర్ నందు అంబర్పేట పోలీస్ సిబ్బందికి మరియు ఎల్బీనగర్ జోన్, మహేశ్వరం జోన్ సిబ్బందికి ఈరోజు బసవతారం క్యాన్సర్ హాస్పిటల్, మెడికవర్, డా. ఐ అగర్వాల్, సౌజన్య డెంటల్ డాక్టర్లు పాల్గొన్నారు.డా. కల్పన క్యాన్సర్ గురించి అవగాహన కల్పించారు. డాక్టర్ సురేష్ రెడ్డి గుండె సంబంధించిన సమస్యలను వివరించడం జరిగింది వాటి నివారణకు ఎలా జాగ్రత్త తీసుకోవాలి. మహిళ సిబ్బందికి ముందస్తుగా క్యాన్సర్ రాకుండా ఉండే విధంగా  చెకప్ లు నిర్వహించడం జరుగుతుంది.ఈ క్యాంపు రేపు కూడా కొనసాగుతుంది. 

ఈ కార్యక్రమంలో డిసిపి ఉషారాణి, ఉమెన్ సేఫ్టీ, డిసిపి శ్రీనివాసులు, ట్రాఫిక్, డీసీపీ శ్యాంసుందర్ సిఆర్ హెడ్ క్వార్టర్, సావిత్రి, RKSC చీఫ్ కో ఆర్డినేటర్, డాక్టర్ లు సరిత, అచ్యుత రావు, పోలీస్ అధికారుల సంఘం ప్రతినిధులు సీహెచ్ భద్రా రెడ్డి, కృష్ణా రెడ్డి మరియు తదితర అధికారులు, సిబ్బంది  పాల్గొన్నారు

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com