సౌదీలో 425 మంది ఉద్యోగులపై దర్యాప్తు..142 మంది అరెస్ట్..!!
- August 02, 2025
రియాద్: జూలై నెలలో నమోదైన అవినీతి కేసుల్లో 425 మంది ప్రభుత్వ ఉద్యోగులపై దర్యాప్తు చేసి, 142 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పర్యవేక్షణ, అవినీతి నిరోధక సంస్థ (నజహా) ప్రకటించింది. అరెస్టయిన వారిలో కిందరిని బెయిల్‌పై విడుదల చేశారు. మొత్తం 2,354 తనిఖీలు నిర్వహించి, అనేక క్రిమినల్, అడ్మినిస్ట్రేటివ్ కేసులను విచారించినట్టు నజహా ఒక ప్రకటనలో తెలిపింది.
విచారించిన వారిలో అంతర్గత, రక్షణ, నేషనల్ గార్డ్, మున్సిపల్, గ్రామీణ వ్యవహారాలు, గృహనిర్మాణం, విద్య, ఆరోగ్యం, న్యాయం, మానవ వనరులు, సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖల ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. అవినీతిని ఎదుర్కోవడానికి నజహా తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. ప్రజా సంస్థలపై నమ్మకాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపింది.
తాజా వార్తలు
- నకిలీ మద్యం కేసు..ప్రభుత్వం కీలక నిర్ణయం..సిట్ ఏర్పాటు..
- హైదరాబాద్: భారతదేశపు తొలి సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభం
- హైదరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్‌లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్‌కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!