సెమీస్ కు దూసుకెళ్లిన లక్ష్యసేన్, తరుణ్..
- August 02, 2025
మకావ్ ఓపెన్ 2025 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి.పురుషుల సింగిల్స్‌లో లక్ష్య సేన్, తరుణ్ మన్నేపల్లి సెమీఫైనల్స్ చేరగా, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ నిష్క్రమించింది.
- కామన్వెల్త్ గేమ్స్ విజేత లక్ష్య సేన్ ఈ సంవత్సరంలో తొలిసారి BWF వరల్డ్ టూర్ సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు.చైనాకు చెందిన జూ షుయాన్ చెన్ను 21-14, 18-21, 21-14 తేడాతో ఓడించాడు. ఈ మ్యాచ్ సుమారు ఒక గంట మూడు నిమిషాల పాటు సాగింది.
- తరుణ్ మన్నేపల్లి కూడా అద్భుత ప్రదర్శనతో తన తొలి BWF వరల్డ్ టూర్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. చైనా ఆటగాడు హూ జె అన్నపై 21-12, 13-21, 21-18 తేడాతో విజయం సాధించాడు. ఈ పోరు ఒక గంట 15 నిమిషాల పాటు జరిగింది.
- సెమీ ఫైనల్స్‌లో లక్ష్య సేన్ ఇండోనేషియా క్రీడాకారుడు ఆల్వీ ఫర్హాన్‌ను, తరుణ్ మలేషియాకు చెందిన జస్టిన్ హోను ఎదుర్కొనబోతున్నారు.
- మరోవైపు, ప్రపంచ మాజీ నంబర్ వన్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి – చిరాగ్ శెట్టి మాత్రం క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలయ్యారు. మలేషియా జంట చూం హాన్ జియాన్–ముహమ్మద్ హైకల్ చేతిలో 14-21, 21-13, 22-20 తేడాతో ఓటమి చవిచూశారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







