సౌదీలో 122,000 టన్నులకు పైగా గ్రేబ్స్ ఉత్పత్తి..!!
- August 03, 2025
రియాద్: ఈ ఆగస్టులో సౌదీ మార్కెట్లు స్థానికంగా పండించే వేసవి సీజన్ గ్రేబ్స్ తో నిండిపోనుంది. దేశీయ గ్రేబ్స్ వాటి ఉన్నతమైన నాణ్యత, దిగుమతి చేసుకున్న రకాల కంటే అధిక డిమాండ్ పొందనున్నాయి. ఏటా 122,300 టన్నులకు పైగా ద్రాక్షను ఉత్పత్తి చేస్తుందని, దేశవ్యాప్తంగా మార్కెట్ అవసరాలను తీరుస్తుందని అధికారులు తెలిపారు. సౌదీ ద్రాక్ష వివిధ ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలలో కూడా కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ద్రాక్ష ఉత్పత్తి చేసే ప్రధాన ప్రాంతాలలో తబుక్, ఖాసిమ్, హైల్, అల్-జౌఫ్, మదీనా, అసిర్, తైఫ్ ఉన్నాయని, ప్రసిద్ధ స్థానిక రకాలు తైఫీ, హలావానీ, బనాటి, ఎర్లీ స్వీట్, క్రిమ్సన్ సీడ్‌లెస్, థాంప్సన్ సీడ్‌లెస్, సుపీరియర్ లకు అధిక డిమాండ్ ఉందన్నారు. జ్యూస్‌లు, ఐస్ క్రీం, మిఠాయి వంటి పలు పరిశ్రమలలో గ్రేబ్స్ వినియోగానికి మద్దతు ఇస్తుందన్నారు.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







