డిజిటల్ వాలెట్లు, బ్యాంకు ఖాతాల మోసం...ఇద్దరు మోసగాళ్లు అరెస్ట్

- August 03, 2025 , by Maagulf
డిజిటల్ వాలెట్లు, బ్యాంకు ఖాతాల మోసం...ఇద్దరు మోసగాళ్లు అరెస్ట్

దుబాయ్: బ్యాంకు ఖాతాలు మరియు డిజిటల్ వాలెట్లను అక్రమ కార్యకలాపాలకు ఉపయోగించిన ఇద్దరు మోసగాళ్లను దుబాయ్ పోలీసు విభాగంలోని అండర్ ఫ్రాడ్ సెంటర్ అరెస్ట్ చేసింది.ఆన్‌లైన్ మోసాల ద్వారా లభించిన నిధులను గమ్యం తెలియకుండా తరలించేందుకు ఈ ఖాతాలను ఉపయోగించారు.

"మోసాలపై అప్రమత్తంగా ఉండండి" అనే అవగాహన కార్యక్రమం భాగంగా ఈ కేసు వివరాలను దుబాయ్ పోలీస్ వెల్లడించింది. మోసగాళ్లు సోషల్ మీడియా వేదికగా పలువురిని టార్గెట్ చేసి, తక్కువ మొత్తాలకు వారి బ్యాంకు వివరాలు ఇవ్వమని లేదా కొత్త ఖాతాలను తెరవమని ప్రలోభ పెట్టారు. అనంతరం ఈ ఖాతాలను మోసపు నిధుల గమ్యాన్ని దాచేందుకు వినియోగించారు.

అధికారులు ఈ మోసగాళ్ల తంతును గమనించి, వారి స్థానాన్ని గుర్తించి, అరెస్టు చేశారు. వారితో పాటు మోసాలకు ఉపయోగించిన అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, పేమెంట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులపై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి.

దుబాయ్ పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ, అనధికార వర్గాల నుండి వచ్చే బ్యాంక్ ఖాతాల ప్రారంభానికి సంబంధించిన ప్రలోభాలకు స్పందించవద్దని పేర్కొన్నారు.ఇలా చేస్తే వారు తెలిసీ తెలియక మోసాలకు సహకారులు కావచ్చని, తీవ్ర చట్టపరమైన పరిణామాలు ఎదురవుతాయని పేర్కొన్నారు.

అంతేకాక, ఏవైనా అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే "eCrime" వెబ్‌పోర్టల్ లేదా దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్ ద్వారా సమాచారం ఇవ్వాలని కోరారు.వ్యక్తిగత బ్యాంకింగ్ సమాచారం, డేటా భద్రత పై అప్రమత్తత అవసరమని, ఇది సమాజం మొత్తం ఆర్థిక మరియు సామాజిక భద్రతకు కీలకమని పోలీసులు హితవు పలికారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com