‘జటాధర’ టీజర్ విడుదల తేదీ ఖరారు!
- August 04, 2025
టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘జటాధర’.వెంకట్ కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, హిందీ భాషల్లో బైలింగ్యువల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ను ఆగస్టు 8న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త లుక్‌ను కూడా విడుదల చేశారు.
టీజర్ అప్డేట్తో ఆసక్తి రేపుతున్న కొత్త లుక్
విడుదలైన కొత్త లుక్‌లో ఒకవైపు శివుడు, మరోవైపు చేతిలో త్రిశూలాన్ని పట్టుకున్న సుధీర్‌బాబు, ఇంకోవైపు ఉగ్రరూపంలో కనిపిస్తున్న సోనాక్షి సిన్హా లూక్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నాయి. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ చిత్రంలో యాక్షన్‌తో కూడిన ఉత్కంఠభరితమైన సన్నివేశాలు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తాయని టీజర్ అప్డేట్ లుక్ హింట్ ఇస్తుంది.
నిర్మాణం, తారాగణం
శివన్ నారంగ్, ప్రేర్నా అరోరా, నిఖిల్ నందా, ఉజ్వల్ ఆనంద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాపులర్ జీ స్టూడియోస్ భాగస్వామ్యంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
సుధీర్ బాబు ఆశలన్నీ ‘జటాధర’ పైనే!
సుధీర్ బాబు గత చిత్రాలైన హరోం హర మరియు మా నాన్న సూపర్ హీరో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దీంతో సుధీర్ బాబు తన ఆశలన్నీ ‘జటాధర’ పైనే పెట్టుకున్నాడు.
తాజా వార్తలు
- పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో అత్యంత అరుదైన ఈఎన్టీ శస్త్రచికిత్సలు
- ఇండోనేషియాలో 22 మంది ఆహుతి
- విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్
- సౌదీలో 2% పెరిగిన విదేశీ రెమిటెన్స్..!!
- దోహా, రియాద్ మధ్య 2గంటలు తగ్గనున్న ట్రావెల్ టైమ్..!!
- భారత్ కు బంగారం తీసుకువెళుతున్నారా?
- కువైట్ లో మాదకద్రవ్యాల రవాణకు పాల్పడితే ఉరిశిక్ష..!!
- గల్ఫ్ యూత్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- ఒమన్ ఆయిల్, గ్యాస్ ఆవిష్కరణ..శతాబ్ది ఉత్సవాలు..!!
- నైజీరియాలో అపహరణకు గురైన 100 మంది పిల్లల అప్పగింపు







