కువైట్‌లో 5.6% తగ్గిన డొమెస్టిక్ వర్కర్స్..!!

- August 04, 2025 , by Maagulf
కువైట్‌లో 5.6% తగ్గిన డొమెస్టిక్ వర్కర్స్..!!

కువైట్: 2025 మొదటి త్రైమాసికం చివరి నాటికి కువైట్‌లోని మొత్తం ప్రవాస కార్మికులలో డొమెస్టిక్ కార్మికులు మొత్తం 745,000 (25.2 శాతం) ఉన్నారు. 2024 మొదటి త్రైమాసికం ముగింపుతో పోలిస్తే ఇది 5.6 శాతం తగ్గుదల అని అల్‌షాల్ నివేదిక తెలిపింది.డొమెస్టిక్ కార్మికులలో దాదాపు 415,000 మంది మహిళలు, 330,000 మంది పురుషులు ఉన్నారు. తొలిస్థానంలో 131,000 మంది ఫిలిప్పీన్స్ మహిళా వర్కర్స్ ఉన్నారు.గత సంవత్సరం వీరి సంఖ్య 175,000 గా ఉంది.

2024 మొదటి త్రైమాసికంలో 248,000 మంది కార్మికులతో భారతీయ మేల్ డొమెస్టిక్ వర్కర్స్ ఈ విభాగంలో అగ్రస్థానంలో ఉన్నారు.భారతదేశం మొత్తం డొమెస్టిక్ కార్మికులలో అత్యధికంగా 42.2 శాతం వాటాను కలిగి ఉంది.తరువాత శ్రీలంక, ఫిలిప్పీన్స్ ఒక్కొక్కటి 17.9 శాతంతో ఉన్నాయి. బంగ్లాదేశ్‌తో కలిపి, ఈ నాలుగు దేశాల వారు కువైట్‌లోని మొత్తం డొమెస్టిక్ వర్క్ పోర్సులో 89.6 శాతం ఉన్నారని నివేదిక తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com