కందిపప్పు వీళ్ళు అస్సలు తినకూడదు...!

- August 05, 2025 , by Maagulf
కందిపప్పు వీళ్ళు అస్సలు తినకూడదు...!

పప్పు ధాన్యాల్లో కందిపప్పుకి ప్రత్యేక స్థానం ఉంది. భారతీయ వంటగదిల్లో ఎక్కువగా వాడేది కందిపప్పునే. కందిపప్పుతో చేసిన టమాటా పప్పు, సాంబార్, ఆకుకూర పప్పుకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. అన్నం, చపాతీలు, రోటీల్లో దీన్ని ఎక్కువగా తింటుంటారు. పప్పు రుచి ఎంతో కమ్మగా ఉంటుంది. నోటికి రుచిని అందివ్వడమే కాకుండా కందిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కందిపప్పులో పోషకాలు మెండుగా ఉన్నాయి. కందిపప్పులో ప్రోటీన్, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, సోడియం, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.. కొందరు పొరపాటున కూడా కందిపప్పు తినకూడదు. ఎవరు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. 

​యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నవారు కందిపప్పును తినకూడదు. యూరిక్ యాసిడ్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్‌లతో తయారవుతుంది. యూరిక్ యాసిడ్ పెరిగితే కీళ్ల నొప్పులు ఎక్కువైపోతాయి. ఆ నొప్పులు తట్టుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రోటీన్ శరీరంలో అధిక మొత్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిల్ని పెంచుతుంది. దీని కారణంగా కాళ్లు, చేతుల్లో తీవ్రమైన నొప్పి, కీళ్ల వాపు ఉంటుంది. అందుకే ఈ సమస్య ఉన్నవారు కందిపప్పు తినకూడదు.

చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారు కందిపప్పు తినకూడదని నిపుణులు అంటున్నారు. ఇందుకు కారణం కందిపప్పులో పొటాషియం ఎక్కువగా ఉండటమే. ఈ పొటాషియం కిడ్నీ రోగుల సమస్యను మరింత పెంచుతుంది. ఎక్కువ పొటాషియంను కిడ్నీలు సరిగ్గా ఫిల్టర్ చేయలేవు. దీంతో వాటిపై ఒత్తిడి పెరుగుతుంది. మీ సమస్య ఇంకా తీవ్రమవుతుందని నిపుణులు అంటున్నారు. కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారు కందిపప్పుని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. 

పైల్స్ సమస్యలతో బాధపడేవారు కందిపప్పు తినకూడదు. కందిపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఉదయం మలవిసర్జన జరిగే సమయంలో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. దీని కారణంగా పైల్స్ రోగుల సమస్య పెరుగుతుంది. పైల్స్ సమస్య ఉన్నవారు కందిపప్పు తింటే వాపు, రక్తస్రావం వంటి సమస్యలు పెరుగుతాయి. 

కడుపులో గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు కందిపప్పు తినకూడదు. కందిపప్పు తినడం వల్ల మీ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. సాధారణంగా కందిపప్పు జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని కారణంగా ఇప్పటికే జీర్ణ సమస్యలతో బాధపడుతున్నవారు కందిపప్పు తినకూడదు. పొరపాటున తింటే కడుపునొప్పి, పుల్లని తేన్పులు, గ్యాస్ వంటి సమస్యలు ఎక్కువైపోతాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com