ఒమన్ లోని నాలుగు హిస్టారికల్ సైట్స్ కు చారిత్రక గుర్తింపు..!!

- August 05, 2025 , by Maagulf
ఒమన్ లోని నాలుగు హిస్టారికల్ సైట్స్ కు చారిత్రక గుర్తింపు..!!

మస్కట్: ఒమన్ కు చెందిన నాలుగు హెరిటేజ్ సైట్స్ అరుదైన ఘనతను సాధించాయి. అరబ్ రిజిస్టర్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ మరియు అర్బన్ హెరిటేజ్‌లో చోటు సంపాదించాయి. జాలాన్ బని బు అలీలోని విలాయత్‌లోని అల్ హమౌదా మసీదు, సోహార్ మరియు నిజ్వా చారిత్రాత్మక కోటలతోపాటు నిజ్వాలోని విలాయత్‌లోని అల్ అక్ర్ అనే పురాతన గ్రామంలోని అల్ షావద్నా మసీదు ఈ జాబితాలో చోటు సంపాదించాయి. లెబనీస్ రిపబ్లిక్‌లో జరిగిన అరబ్ స్టేట్స్‌లోని అబ్జర్వేటరీ ఆఫ్ ఆర్కిటెక్చరల్ మరియు అర్బన్ హెరిటేజ్ 10వ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. 

అరబ్ లీగ్ ఎడ్యుకేషనల్, కల్చరల్ అండ్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్ (ALECSO) తో అనుబంధంగా ఉన్న వాటిల్లో అబ్జర్వేటరీ ఆఫ్ ఆర్కిటెక్చరల్ అండ్ అర్బన్ హెరిటేజ్ ఒకటి. ఇది అరబ్ దేశాలలో ఆర్కిటెక్చరల్ మరియు అర్బన్ హెరిటేజ్‌ను డాక్యుమెంట్ చేయడం, పరిరక్షణ ప్రయత్నాలకు సహకరించడంపై దృష్టి పెడుతుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com