దుబాయ్ లో 20% పెరిగిన స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జ్‌లు..!!

- August 07, 2025 , by Maagulf
దుబాయ్ లో 20% పెరిగిన స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జ్‌లు..!!

దుబాయ్: దుబాయ్ లో స్మార్ట్ నాల్ కార్డ్ రీఛార్జ్‌లలో 20 శాతం పెరుగుదల నమోదైంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టును వినియోగించుకుంటున్న వారి సంఖ్య గతేడాది కంటే ఈ ఏడాది పెరిగిందని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
టిక్కెట్ల అమ్మకాలు మరియు టాప్-అప్‌ల కోసం డిజిటల్ మెషీన్‌ల ఏర్పాటు, వెబ్‌సైట్ మరియు మొబైల్ చెల్లింపు అప్లికేషన్‌ల వంటి డిజిటల్ ఛానెల్‌ల వినియోగంతోపాటు మినిమం రీఛార్జిని తగ్గండం వంటి నిర్ణయాల కారణంగా ఈ పెరుగుదల నమోదైనట్లు పేర్కొంది.
ఇక టికెట్ వెండింగ్ మెషీన్ల ద్వారా జరిగే మొత్తం టాప్-అప్ ల సంఖ్యలో 28 శాతం తగ్గుదల నమోదు అయింది. కౌంటర్ టికెట్ అమ్మకాల లావాదేవీలు 37 శాతం తగ్గగా.. డిజిటల్ లావాదేవీలు 6 శాతం తగ్గాయని ఆర్టీఏ వెల్లడించింది.   

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com