బహ్రెయిన్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ రెస్పాన్స్ డ్రిల్..!!

- August 07, 2025 , by Maagulf
బహ్రెయిన్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ రెస్పాన్స్ డ్రిల్..!!

మనామా: బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ రెస్పాన్స్ డ్రిల్ నిర్వహించారు.  అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పులు ఎలా వ్యవహారించాలో ఈ సందర్భంగా సిబ్బంది చేసి చూపించారు. ఇందులో పలు విభాగాలకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు. ప్రయాణికుల భద్రతకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎయిర్ పోర్టులోని వివిధ విభాగాల మధ్య సమన్వయం, సిబ్బంది సామర్థ్యం ఈ డ్రిల్ ద్వారా మరింత పెరిగిందన్నారు. 

ఎమర్జెన్సీ రెస్పాన్స్ డ్రిల్ సందర్భంగా సిబ్బంది ప్రదర్శించిన ధైర్య సహసాలు అందరిని కట్టిపడేశాయి. అత్యవసర పరిస్థితి తలెత్తిన సమయంలో ప్రయాణికులను ఎలా రక్షించాలి, ఫ్లైట్ లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులను సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలో చేసి చూపించారు. అలాగే ఫ్లైట్ టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో నెలకొనే టెక్నికల్ సమస్యలు, వాటి నివారణకు సంబంధించి అవగాహన కల్పించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com