తెలంగాణ డిజిపి అర్థ వార్షిక క్రైం రివ్యూ మీటింగ్

- August 07, 2025 , by Maagulf
తెలంగాణ డిజిపి అర్థ వార్షిక క్రైం రివ్యూ మీటింగ్

హైదరాబాద్: డిజిపి జితేందర్ అర్థ వార్షిక క్రైం రివ్యూ మీటింగ్ నిర్వహించారు. డిజిపి కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో శాంతి భద్రతల అదనపు డిజి మహేష్ భగవత్, పర్సనల్ విభాగం అదనపు డిజి అనిల్ కుమార్, సిఐడి చీఫ్ చారు సిన్హా రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల కొత్వాళ్లు సుధీర్బాబు, అవినాష్ మొహంతి, పి అండ్ ఎల్ ఐజి రమేష్, ఐజి చంద్రశేఖర్ రెడ్డితో పాటు డిఐజి తఫ్సీర్ ఇక్బాల్ అన్ని రేంజిల డిఐజిలు, జిల్లాల ఎస్పిలు, కమిషనర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డిజిపి (DGP) గడచిన ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులతో పాటు నేరాల నివారణకు పోలీసులు తీసుకున్న చర్యలను ప్రశంసించారు. శాంతి భద్రతలు సవ్యంగా వుండడంతో పాటు అనేక కేటగిరిల్లో నేరాల తగ్గుదల వుందని డిజిపి (DGP) తెలిపారు. ప్రతీ జిల్లాలో నేరాల విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి డిజిపి వివరించారు. దీంతో పాటు సైబర్ నేరాల కట్టడికి (To curb cybercrime), ఆర్థిక నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను కూడా డిజిపి వివరించారు, విజిబుల్ పోలీసింగ్ వల్ల చాలా వరకు నేరాలను నివారించవచ్చని ఆయన తెలిపారు. ప్రజల భద్రతకు మరింత కష్టపడి పనిచేయాలని, మహిళల భద్రతకు పెద్ద పీట వేయాలని, మనుషుల అక్రమ రవాణాను నిరోధించాలని, షీ బృందాలు, భరోసా కేంద్రాలు పటిష్టంగా వుంటే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని డిజిపి తెలిపారు. సమవేశం చివరి దశలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరక్టర్ శిఖా గోయల్ సైబర్ నేరాలకు తమ విభాగం తీసుకుంటున్న చర్యలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సైబర్ నేరాల వల్ల అమాయకులు మోసపోతున్న తీరు, వీటిని ఎలా అరికట్టవచ్చు అనే దాని పై ఆమె పోలీసు అధికారులకు వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com