ఫాస్ట్ లేన్‌లో నెమ్మదిగా డ్రైవింగ్ చేస్తున్నారా? దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- August 08, 2025
దుబాయ్ః ఫాస్ట్ లేన్‌లో నెమ్మదిగా డ్రైవింగ్ చేసే వాహనదారులను దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి ధోరణి ఇతర వాహనదారులకు ప్రమాదకరం అని తెలిపింది. ఫాస్ట్ లేన్లలో కనీస పరిమితి కంటే ఎక్కువ వేగాన్ని కొనసాగించాలని దుబాయ్ పోలీసులు సూచించారు. కనీస వేగం కంటే ఎక్కువ వేగంతో వెల్లడం ద్వారా ట్రాఫిక్ సమస్యలు కూడా తీరతాయని పేర్కొన్నారు.
2023లో యూఏఈలో కనీస వేగ పరిమితి కంటే తక్కువ వేగంతో వాహనం నడిపినందుకు 300,147 మంది వాహనదారులకు జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ అథారిటీ వెల్లడించింది. యూఏఈలోని ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం, కనీస వేగ పరిమితి కంటే తక్కువ వేగంతో వాహనాన్ని నడిపితే Dh400 జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు. వాహనదారులు తమ వేగానికి సరిపోయేలా సరైన లేన్ ను ఎంచుకోవాలన్నారు. వాహనదారులు తాము వెళ్లే లేన్‌కు నిర్దేశించిన వేగంతో వెళ్లాలని సూచించారు.
తాజా వార్తలు
- క్రైస్తవ సమస్యలు పరిష్కరిస్తా: మంత్రి అజారుద్దీన్
- తెలంగాణ రాష్ట్రంలో కొద్దిగా తగ్గిన చలితీవ్రత
- దుర్గమ్మ నినాదాలతో మార్మోగుతున్న బెజవాడ
- ఇక అన్ని ఆలయాల్లో యుపిఐ చెల్లింపులు
- ఇన్స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్
- NATS సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విప్లవాత్మక మార్పులు
- బహ్రెయిన్ గోల్డెన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఇండియన్ స్కూల్..!!
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!







