రియాద్ రెసిడెన్షియల్ ఏరియాల్లో నాన్-పెయిడ్ మేనేజ్డ్ పార్కింగ్‌..!!

- August 08, 2025 , by Maagulf
రియాద్ రెసిడెన్షియల్ ఏరియాల్లో నాన్-పెయిడ్ మేనేజ్డ్ పార్కింగ్‌..!!

రియాద్ః రియాద్ రెసిడెన్షియల్ ఏరియాల్లో నాన్-పెయిడ్ మేనేజ్డ్ పార్కింగ్‌ మొదటి దశ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఇకపై కమర్షియల్ ఏరియాల్లోని పార్కింగ్ సదుపాయలను పెంచడంతోపాటు రెసిడెన్షియల్ ఏరియాల్లో అనధికార పార్కింగ్ విధానాలను అడ్డుకోనున్నారు. ఇకపై మెరుగైన పార్కింగ్ కోసం డిజిటల్ రెసిడెన్షియల్ పార్కింగ్ పర్మిట్‌లను ప్రవేశపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఇది రియాద్ పార్కింగ్ మొబైల్ యాప్ ద్వారా అందుబాటులో ఉంటుందన్నారు. ప్రారంభ దశలో అల్-వురుద్ పరిసర ప్రాంతాలను కవర్ చేస్తుందని, రాబోయే దశల్లో కమర్షియల్ స్ట్రీట్స్ సమీపంలోని ఇతర ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు.  పార్కింగ్ ఉల్లంఘనలను పర్యవేక్షణకు ఆటోమేటెడ్ లైసెన్స్ ప్లేట్ రికగ్నిషన్ (ALPR) కెమెరాలతో కూడిన స్మార్ట్ పెట్రోల్ వాహనాలతో సహా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ప్రాజెక్ట్ లో ఉపయోగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
ఆగస్టు 2024లో ప్రారంభమైన రియాద్ పార్కింగ్ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్న అతిపెద్ద స్మార్ట్ పార్కింగ్ క్యాంపెయిన్ లలో ఒకటి. ఇందులో 140,000 కంటే ఎక్కువ నాన్-పెయిడ్ రెసిడెన్షియల్ పార్కింగ్ స్థలాలు, కమిర్షియల్ జిల్లాల్లో 24,000 పెయిడ్ స్పాట్‌లను నిర్వహించడం లక్ష్యంగా నిర్దేశించారు. మొదటి దశలో అల్-వురుద్, అల్-రెహ్మానియా, వెస్ట్ ఒలాయా, అల్-మురుజ్, కింగ్ ఫహద్ మరియు అల్-సులైమానియా లో 12 పార్కింగ్ జోన్‌లు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com