స్కామ్ అలెర్ట్.. సోషల్ మీడియా 'డిస్కౌంట్'లపై జాగ్రత్త..!!

- August 08, 2025 , by Maagulf
స్కామ్ అలెర్ట్.. సోషల్ మీడియా \'డిస్కౌంట్\'లపై జాగ్రత్త..!!

దుబాయ్‌: దుబాయ్‌లో ట్రాఫిక్ జరిమానాల పై నకిలీ డిస్కౌంట్లకు సంబంధించిన ఇటీవలి స్కామ్ బయటపడిన నేపథ్యంలో దుబాయ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.  ప్రభుత్వ సేవలకు సంబంధించిన అనధికారిక ఆఫర్‌ల పట్ల, ముఖ్యంగా సోషల్ మీడియా మరియు మెసేజింగ్ యాప్‌ల ద్వారా ప్రచారంలో ఉన్న ఆఫర్లు, డిస్కౌంట్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. 

సోషల్ మీడియాలో వచ్చ ఆఫర్లు, డిస్కౌంట్లు ఒక ట్రాప్ అని డిజిటల్ రిస్క్ అడ్వైజర్ లీలా మన్సూర్ అన్నారు. ట్రాఫిక్ జరిమానాలు, వీసా ఖర్చులు లేదా సర్వీస్ ఫీజులను తగ్గిస్తామని ఆకర్షణీయమైన ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తారని తెలిపారు.  

అధికారికంగా కనిపించే లోగోలు, అత్యవసర మెసేజులు, వాట్సాప్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రైవేట్ ఛానెల్‌లను ఉపయోగించి జరిగే స్కామ్‌లు పెరుగుతున్నాయని యూఏఈకి చెందిన సైబర్ సెక్యూరిటీ విశ్లేషకుడు ఒమర్ ఖద్దూర్ హెచ్చరించారు.  ఏదైనా చెల్లింపుల కోసం యూఏఈ పాస్, అధికార యాప్‌లు లేదా ధృవీకరించబడిన వెబ్‌సైట్‌ల వంటి అధికారిక పోర్టల్‌లపై మాత్రమే ఆధారపడాలని సూచించారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com