షార్జా మహిళ ఆత్మహత్య: కేరళ విమానాశ్రయంలో భర్త అరెస్టు..!!
- August 10, 2025
షార్జా: ఆత్మహత్య చేసుకుని మరణించిన 30 ఏళ్ల షార్జా ప్రవాసురాలు అతుల్య శేఖర్ భర్తను తిరువనంతపురంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఉదయం దుబాయ్ నుండి విమానంలో కేరళ రాజధానిలో దిగిన నలభై ఏళ్ల సతీష్ శంకర్‌ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు.
కాగా, సతీష్ జిల్లా కోర్టు నుండి ముందస్తు బెయిల్ పొందాడని, అతని వాంగ్మూలం నమోదు చేసిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకు బట్టి బెయిల్‌పై విడుదల చేస్తామని పోలీసులు తెలిపారు.
అతుల్య కుటుంబం ఆమె భర్తపై శారీరక వేధింపులు, వరకట్న సంబంధిత నేరాల కింద కేసు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే. అంతకుముందు, ఆమె భర్త ఆమెను శారీరకంగా వేధిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జూలై 19న ఆమె మరణించిన వారం తర్వాత, షార్జా పోలీసులు ఆమె ఉరి వేసుకుని మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. అతుల్య మృతదేహాన్ని ఆమె స్వస్థలానికి తరలించగా , ఆమె కుమార్తె అంత్యక్రియలు దుబాయ్‌లోని సోనాపూర్ న్యూ స్మశానవాటికలో జరిగాయి.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!