అల్-ఖురైనా పట్టణంలో బయటపడ్డ 50వేల సంవత్సరాల కళాఖండాలు..!!
- August 11, 2025
రియాద్ః రియాద్ లోని అల్-ఖురైనా 50వేల సంవత్సరాల నాటి కళాఖండాలు బయటపడ్డాయి. పట్టణంలోని ఒక పురావస్తు ప్రదేశంలో వీటిని గుర్తించినట్లు హెరిటేజ్ కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పురావస్తు ప్రాజెక్ట్ లో మట్టి పాత్రలు, రాతి పనిముట్లును గుర్తించినట్లు, వాటిలో కొన్ని 50వేల సంవత్సరాల నాటి మధ్య రాతి యుగానికి చెందినవని పేర్కొంది.
తవ్వకాల సందర్భంగా క్రీస్తుపూర్వం మూడవ మరియు రెండవ సహస్రాబ్ది నాటి సమాధులను పోలి ఉండే వృత్తాకార నిర్మాణాలు కూడా బయటపడ్డాయని తెలిపింది. ఆధునాతన పద్ధతులను ఉపయోగించి చారిత్రక, పువావస్తు ప్రదేశాలను గుర్తించి, తవ్వకాలు చేపడుతున్నట్లు కమిషన్ వెల్లడించింది. బయటపడ్డ పురావస్తు వస్తువులు, ఈ ప్రాంత ప్రాచిన సాంస్కృతిక మరియు నాగరికత వారసత్వాన్ని తెలియజేస్తుందన్నారు.
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







