యూఏఈలో 17.6 మిలియన్ల ఇల్లీగల్ గూడ్స్ సీజ్..!!
- August 11, 2025
యూఏఈ: యూఏఈలో భారీగా ఇల్లీగల్ గూడ్స్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఫెడరల్ టాక్స్ అథారిటీ దేశవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలను నిర్వహించింది. ఈ సందర్భంగా పొగాకు ఉత్పత్తులు, శీతల పానీయాలు, ఎనర్జీ డ్రింక్స్ సహా 17.6 మిలియన్లకు పైగా నాన్-కాంప్లైంట్ ఎక్సైజ్ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఫెడరల్ టాక్స్ అథారిటీ వెల్లడించింది.
కాగా, జనవరి మరియు జూన్ మధ్య 85,500 తనిఖీలను నిర్వహించినట్లు తెలిపింది. ఇక తనిఖీల సందర్భంగా Dh357.22 మిలియన్ల పన్నులు, జరిమానాలను వసూలు చేసినట్లు పేర్కొంది. ఇక అధికారులు సీజ్ చేసిన వస్తువులలో స్టాంపింగ్ లేని 11.52 మిలియన్ పొగాకు ప్యాక్‌లు, గుర్తింపు లేని 6.1 మిలియన్ బాటిళ్లు ఉన్నాయని తెలిపింది. వినియోగదారుల రక్షణకు నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని FTAలో ట్యాక్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సారా అల్ హబ్షి తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి