మండేలా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన 'టాసా'
- July 17, 2016
దక్షిణాఫ్రికా ఉద్యమ సూరీడు నెల్సన్ మండేలా జన్మదిన వేడుకలను తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా (టాసా) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రేపు (జూలై 18)న మండేలా పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ థెంబిసాలోని పాఠశాలలో టాసా నిర్వహకులు సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులకు కావాల్సిన బట్టలు, ఆహార వస్తువులు, పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలను అందజేశారు. ఈమేరకు విద్యార్థులకు రెండుమూడు నెలలకు సరిపడా గ్రాసం అందజేశామని టాసా ప్రతినిధి జి.నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమములో సుబ్బారావు గారు, శ్రీనివాస్, భూమయ్య, సురేష్, నాగరాజు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









