కన్యా కుమారి' ఆగస్టు 27న థియేటర్లలో రిలీజ్

- August 11, 2025 , by Maagulf
కన్యా కుమారి\' ఆగస్టు 27న థియేటర్లలో రిలీజ్

ప్రముఖ నటి మధు శాలిని ప్రెజెంటర్‌గా రూరల్ లవ్ స్టొరీ "కన్యా కుమారి" చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై సృజన్ అట్టాడ రచన, దర్శకత్వం, నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రంలో గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ చిత్రాన్ని ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. రిలీజ్ డేట్ పోస్టర్ లో  శ్రీచరణ్ గీత్ సైనీని ప్రేమగా ఎత్తుకుంటూ, ఆమె చేతులకు సీతాకోకచిలుక రెక్కలు అలంకరించినట్టుగా డిజైన్ చేయడం ఆకట్టుకుంది.

"అన్ ఆర్గానిక్ ప్రేమ కథ" అన్న ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో క్యురియాసిటీ పెంచింది. రిలీజ్‌ దగ్గరపడటంతో టీమ్ మరింత జోరుగా ప్రమోషన్స్‌కి సిద్ధమవుతోంది.

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో సహజ వాతావరణంలో నడిచే ఈ లైఫ్ ఫీల్‌ కథ సినిమాటిక్ టచ్‌తో ఒక కొత్త ఫీల్ ని అందించనుంది. రవి నిలమర్తి అందించిన ఆకట్టుకునే సంగీతం, శివ గాజుల, హరి చరణ్ కె అద్భుతమైన సినిమాటోగ్రఫీ, నరేష్ అడుపా ఎడిటింగ్ ఇవన్నీ ఈ ప్రేమకథను మరింత అందంగా మలిచాయి.

పల్లె అందాలు, ఆకట్టుకునే ప్రేమకథ, పండుగ వాతావరణంతో కన్యా కుమారి ఈ సీజన్‌లో మనసులను కట్టిపడేయడానికి సిద్ధంగా ఉంది.

తారాగణం: గీత్ సైనీ, శ్రీచరణ్ రాచకొండ
సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్ - రాడికల్ పిక్చర్స్
సమర్పణ - మధు షాలిని
రచన, దర్శకత్వం & నిర్మాత - సృజన్ అట్టాడ
డిఓపి - శివ గాజుల, హరి చరణ్ కె
సంగీతం - రవి నిడమర్తి
ఎడిటింగ్ - నరేష్ అడుప
సహ నిర్మాతలు – సతీష్ రెడ్డి చింత, వరేనియా మామిడి, అప్పల నాయుడు అట్టాడ, సిద్ధార్థ్ ఎ.
సౌండ్ డిజైనర్ - నాగార్జున తాళ్లపల్లి
సౌండ్ మిక్సింగ్ - వంశీప్రియ రాసినేని (సౌండ్‌రూఫ్ స్టూడియోస్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com