రేపు అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన

- August 12, 2025 , by Maagulf
రేపు అమరావతిలో బసవతారకం ఆసుపత్రికి శంకుస్థాపన

అమరావతి: అమరావతిలో మెరుగైన ఆరోగ్య సదుపాయాల కల్పన దిశగా మరో కీలక అడుగు పడుతోంది. రాజధాని పరిధిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం రేపు జరగనుంది.

తుళ్లూరు–అనంతవరం గ్రామాల మధ్య విస్తరించిన 21 ఎకరాల భూమిపై ఈ ఆసుపత్రిని నిర్మించనున్నారు. ఈ భూమిని రాష్ట్ర రాజధాని అభివృద్ధి సంస్థ (CRDA) తాజాగా కేటాయించింది. శంకుస్థాపన కార్యక్రమం రేపు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నేత, నటుడు మరియు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులతో కలిసి హాజరవుతున్నారు.ఆయనే ఈ ఆసుపత్రి అభివృద్ధికి కీలకంగా కృషి చేస్తున్నారు.

అమరావతిలో నిర్మించనున్న ఈ క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభ దశలో 300 పడకల సామర్థ్యంతో నిర్మించనున్నారు.తర్వాత దాన్ని 1000 పడకల సామర్థ్యానికి విస్తరించే ప్రణాళిక ఉందని సమాచారం.

ఈ ఆసుపత్రికి సంబంధించి తొలి ప్రణాళికలు 2014–2019 కాలంలోనే రూపొందినవే. అప్పట్లోనే భూమి కేటాయించినప్పటికీ, 2019లో పాలన మారడంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఇప్పుడు తిరిగి భూమి కేటాయించడంతో ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తవుతుందని ఆశిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com