ఆగస్టు 31న GCC ఫోరం ఫర్ గ్రీన్ మొబిలిటీ ప్రారంభం..!!

- August 13, 2025 , by Maagulf
ఆగస్టు 31న GCC ఫోరం ఫర్ గ్రీన్ మొబిలిటీ ప్రారంభం..!!

సలాలా: GCC ఫోరం ఫర్ గ్రీన్ మొబిలిటీ 2025 ఆగస్టు 31న దోఫర్ గవర్నరేట్‌లోని సలాలాలోని విలాయత్‌లో ప్రారంభమవుతుంది. రవాణా రంగంలో పర్యావరణ స్థిరత్వాన్ని ప్రోత్సహించడంతోపాటు ప్రత్యామ్నాయ రవాణా విధానాల వినియోగాన్ని ప్రోత్సహించడం  లక్ష్యంగా ఈ ఫోరాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో జీసీసీ దేశాల నుంచి వాహన రంగ నిపుణులు పాల్గొంటారు.  రవాణా రంగంలో కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి దోహదపడే కీలక విధానాలపై చర్చిస్తారు.   

ముఖ్యంగా సలాలాలోని సుల్తాన్ ఖబూస్ యూత్ కాంపౌండ్ ఫర్ కల్చర్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో జరిగే "గల్ఫ్ యూత్ లీడ్ చేంజ్" వర్క్‌షాప్ మరియు "గ్రీన్ కారిడార్స్ ఫర్ గల్ఫ్ పోర్ట్స్" వర్క్‌షాప్ లు జరుగుతాయి. ఈ సందర్భంగా గ్రీన్ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో అనేక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందన్నారు.  దీంతోపాటు ఆగస్టు 15-16 తేదీలలో పిల్లలకు పర్యావరణ సంబంధిత అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com