సినిమా రివ్యూ:‘వార్ 2’
- August 14, 2025
‘బ్రహ్మాస్త్ర’ వంటి ఓ భారీ చిత్రం తర్వాత దర్శకుడు అయాన్ ముఖర్జీ నుంచి వచ్చిన చిత్రమే ‘వార్ 2’. హృతిక్ రోషన్, టైగర్ ష్రాష్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం ప్రాంచైజీలో భాగంగా రెండో పార్ట్‌లో ఎన్టీయార్ జతయ్యారు. దాంతో తెలుగు ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఆసక్తి నెక్స్‌ట్ లెవల్‌కి చేరుకుంది. మరి, ఆ స్థాయిలో ‘వార్ 2’ అంచనాల్ని అందుకుందా.? లేదా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
మాజీ రా ఏజెంట్ అయిన కబీర్ కొన్ని కారణాలతో దేశ ద్రోహి అని ముద్ర వేయించుకుని రా కళ్లుగప్పి అజ్ఞాతంలో బతుకుతుంటాడు. ఈ క్రమంలో ఓ కాంట్రాక్ట్ నిమిత్తం జపాన్‌లోని అత్యంత శక్తివంతమైన వ్యక్తిని హత్య చేస్తాడు. ఆ తర్వాత అతనిపై ఓ అజ్ఞాత అసాంఘిక శక్తి దృష్టి పడుతుంది. భారతదేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించే ఈ అజ్ఞాత శక్తి ఎలాగైనా కబీర్‌ని పట్టుుకుని తమ కోసం పని చేయాలని ఫోర్స్ చేస్తుంది. ఆ క్రమంలోనే ఓ కాంట్రాక్ట్ అప్పచెబుతుంది. ఆ పనిని అత్యంత సునాయాసంగా పూర్తి చేస్తాడు కబీర్. ఈ కాంట్రాక్ట్ కిల్లర్‌ని పట్టుకోవాలని రా ఏజెన్సీ సోల్జర్ అయిన విక్రమ్ చలపతి (ఎన్టీయార్)ని నియమిస్తుంది. కబీర్‌కి గాడ్ ఫాదర్ అయిన సునీల్ లూథ్రా కూతురయిన కావ్య లూత్రా (కియారా అద్వానీ) వింగ్ కమాండర్ హోదాలో ఈ ఆపరేషన్‌లో భాగం అవుతుంది. అసలింతకీ కావ్యకీ, కబీర్‌కీ వున్న సంబంధం ఏంటీ.? దేశ భక్తుడు, సునీల్ లూథ్రాకి నమ్మిన బంటు అయిన కబీర్ ఎందుకు అతన్ని చంపాల్సి వచ్చింది.? దేశ ద్రోహిగా ఎందుకు మారాల్సి వచ్చింది. కలి అని పిలవబడే అసాంఘిక శక్తులకీ, విక్రమ్‌కీ సంబంధం ఏంటీ.? తెలియాలంటే ‘వార్ 2’ పెద్ద తెరపై చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
ఆల్రెడీ కబీర్ పాత్రలో ‘వార్’ సినిమాలో హృతిక్ రోషన్‌ని చూసేశాం. అందుకు కొనసాగింపుగా ఏ మాత్రం తగ్గకుండా ఈ పార్ట్‌లోనూ హృతిక్ అదే పాత్రలో తనదైన స్టైలిష్ పర్‌ఫామెన్స్ చూపించాడు. యాక్షన్ ఘట్టాల్లో చెలరేగిపోయాడు. ఈ పార్ట్‌కి వచ్చేసరికి ఎన్టీయార్ రోల్ ఓ సర్‌ప్రైజ్. పూర్తి స్థాయి యాక్షన్ రోల్‌లో ఎన్టీయార్‌ని చూస్తాం ఈ సినిమాలో. చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు ఎన్టీయార్ విక్రమ్ పాత్రలో. సరి సమానంగా హృతిక్‌కి పోటీ ఇచ్చేందుకు మాగ్జిమమ్ ప్రయత్నించాడు.. అయితే, కొన్ని కొన్ని యాక్షన్ ఘట్టాల్లో హృతిక్ పక్కన తేలిపోయాడు. కియారా అద్వానీకి తక్కువ స్కోపున్న పాత్రే. ఫస్టాఫ్‌లో కొన్ని యాక్షన్ ఘట్టాల్లోనూ కియారా నటించింది. ‘ఊపిరే ఊయల..’ పాటలో తన అంద చందాలతో కట్టి పడేసింది. అనిల్ కపూర్, అశుతోష్ రానా పాత్రలు ఓకే. మిగిలిన పాత్రలకు ఏమంత స్కోప్ లేదు.
సాంకేతిక వర్గం పనితీరు:
ఈ సినిమాకి యాక్షన్ ప్రధానాంశం. ఇద్దరు హీరోలను ఆ యాక్షన్‌లో బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది. అయాన్ ముఖర్జీ ఆ విషయంలో మంచి మార్కులేయించుకున్నాడు. అయితే, ఈ తరహా స్సై సినిమాల్లో దేశ భక్తి ముఖ్యమైన అంశం. దేశభక్తిని చాటే అంశాలు ఇంకాస్త ఎఫెక్టివ్‌గా చిత్రీకరించి వుంటే బాగుండేది. ఫస్టాప్ మొత్తం యాక్షన్ పైనే ఫోకస్ పెట్టాడు. సెకండాప్‌లో ప్రధానిని కాపాడే అంశం ఆ ఎపిసోడ్‌లో ఇద్దరు హీరోల సాహసాలు తెరపై చూసేందుకు బాగుంటాయ్. ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌కీ ఐ ఫీస్ట్‌గా వుంటుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో కట్ చేసిన కట్.. సెకండాప్‌పై ఆసక్తిని పెంచేలా వుంటుంది. అయితే, సెకండాప్‌లో కొన్ని యాక్షన్ ఘట్టాలు ఓకే, కానీ, ఓ సందర్భంలో కబీర్‌ని విక్రమ్ వేటాడే ఛేజింగ్ సన్నివేశం చాలా సిల్లీగా అనిపిస్తుంది. అయితే, విజువల్‌గా, టెక్నికల్‌గా ఈ సినిమా చాలా రిచ్‌గా వుంటుంది. ప్రొడక్సన్ వేల్యూస్ బాగున్నాయ్. కెమెరా పనితనం బాగుంది. ఓవరాల్‌గా టెక్నికల్ టీమ్ వర్క్ బాగుందనే చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్:
హృతిక్ రోషన్ మరియు ఎన్టీయార్ పర్‌ఫామెన్స్, యాక్షన్ ఘట్టాలు, ఇంటర్వెల్ బ్యాంగ్, మొదలైనవి.
మైనస్ పాయింట్స్:
వీక్ స్క్రీన్ ప్లే, తేలిపోయిన సెకండాప్, ఆకట్టుకోని భావోద్వేగాలు.. ప్రభావం చూపని దేశభక్తి సన్నివేశాలు..
చివరిగా:
యాక్షన్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్‌కి, ముఖ్యంగా అటు హృతిక్ రోషన్ ఫ్యాన్స్‌కీ, ఇటు ఎన్టీయార్ ప్యాన్స్‌కీ ‘వార్ 2’ ఐ ఫీస్ట్.!
తాజా వార్తలు
- యూఏఈ పై భారత్ ఘన విజయం
- EOగా సింఘాల్..టిటిడిలో మలివిడత ప్రక్షాళనకు శ్రీకారం
- భారత్‌పై విరుచుకుపడుతున్న ట్రంప్.. 100శాతం సుంకాలు.. ఈయూకు కీలక సూచన
- నిలిచిపోయిన గ్రీన్ కార్డ్ వీసాలు
- మేధో సంపత్తి హక్కుల రక్షణపై MoCI అవగాహన..!!
- ఖతార్ సార్వభౌమత్వాన్ని కాపాడాలి: సౌదీ యువరాజు, జోర్డాన్ కింగ్
- కార్మికులకు 700 ఉచిత టిక్కెట్లు.. దుబాయ్ వ్యాపారవేత్త ఉదారత..!!
- ఒకే రోజు 382 పార్కింగ్ ఉల్లంఘనలు నమోదు..!!
- రాజు హమద్ తో ప్రిన్స్ ఫైసల్ సమావేశం..!!
- సోహార్‌లోని అగ్నిప్రమాదం.. ఆరుగురు రెస్క్యూ..!!