మెడిసిన్ క్లియరెన్స్ కోసం ప్రయాణికులకు SFDA గైడ్ లైన్స్..!!
- August 15, 2025
రియాద్: సౌదీ అరేబియాకు వచ్చే లేదా బయలుదేరే ప్రయాణీకుల వద్ద డ్రగ్స్, సైకోట్రోపిక్ పదార్థాలు కలిగిన నియంత్రిత ఔషధాల కోసం క్లియరెన్స్ అనుమతిని పొందే విధానాలను సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ (SFDA) వివరించింది. రోగుల ప్రయాణాన్ని సులభతరం చేయడానికి మరియు భద్రతా ప్రమాణాలను నిర్ధారించడంలో SFDA గైడ్ లైన్స్ ఉపయోగపడతాయని పేర్కొంది. నియంత్రిత ఔషధ అనుమతులకు సంబంధించిన పూర్తి సమాచారం SFDA వెబ్ సైట్ లో ఉందని తెలిపింది.
ప్రయాణికులు ఇప్పుడు CDS ప్లాట్‌ఫామ్ ద్వారా పర్సనల్ ఖాతాను రూపొందించి, అందులో ట్రిప్ సమాచారంతోపాటు ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ పర్మిట్ కు వీలుగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్, మెడికల్ రిపోర్ట్ వంటి పత్రాలను అప్లోడ్ చేయాలని సూచించింది. ఖచ్చితమైన వివరాలను అందించడం ద్వారా ప్రయాణికులు మెడిసిన్స్ కోసం క్లియరెన్స్ ను సులువుగా పొందవచ్చని పేర్కొంది.
తాజా వార్తలు
- లంక పై భారత్ ఘన విజయం..భారత్‌కు రికార్డు స్థాయిలో ఎనిమిదో మహిళల ఆసియా కప్
- బ్రిక్స్ లో ప్యూర్ వెజ్ డిన్నర్..రాహుల్ కౌంటర్
- యూఏఈ అధ్యక్షుడు, జోర్డాన్ రాజు భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు
- ఏపీ వైద్య రంగానికి కేంద్రం కొత్త భరోసా
- సౌదీ అరేబియాలో భారీ ట్రక్కులకు 6 కీలక నిబంధనలు..!!
- కువైట్‌లో డ్రోన్లకు కొత్త చట్టం.. నిబంధనలు ఉల్లంఘిస్తే 2 ఏళ్ల జైలు..!!
- స్కూల్లో పిల్లలకు తరచూ తలనొప్పా? కంటి పరీక్షలు తప్పనిసరి: డాక్టర్లు
- ఖతార్‌లో రిక్రియేషనల్ స్పేసెస్ విస్తరణ వేగవంతం..!!
- ఒమన్‌లో ఏ వస్తువులు, సేవలకు పన్ను ఉండదో తెలుసా?
- బహ్రెయిన్ రాయబారి–యూఎన్ ఉన్నతాధికారుల భేటీ..!!







