లులు హైపర్ మార్కెట్ లో వారం రోజులపాటు ఇండియా ఉత్సవ్..!!

- August 15, 2025 , by Maagulf
లులు హైపర్ మార్కెట్ లో వారం రోజులపాటు ఇండియా ఉత్సవ్..!!

కువైట్: భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, లులు హైపర్ మార్కెట్ 13 ఆగస్టు నుండి 19 వరకు “ఇండియా ఉత్సవ్” పేరిట ప్రత్యేక కార్యక్రమాలు, ప్రమోషన్లను ప్రారంభించింది. ఈ గ్రాండ్ ప్రారంభోత్సవం  లులు హైపర్ మార్కెట్ అల్ రాయ్ అవుట్‌లెట్‌లో జరిగింది. ఈ కార్యక్రమాన్ని IBPC చైర్మన్ కైజర్ టి. షకీర్, IBPC సీనియర్ అడ్వైజరీ కౌన్సిల్ బోర్డు సభ్యుడు కుల్దీప్ సింగ్ లంబా; IBPC అడ్వైజరీ బోర్డు సభ్యుడు S. K. వాధవన్; కువైట్ ఎయిర్‌వేస్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ యాక్టింగ్ డైరెక్టర్ యూసుఫ్ అల్ దఫెరి పాల్గొని ప్రారంభించారు. 

ప్రారంభోత్సవ వేడుకలో భారత రాష్ట్రాల వారీగా నృత్య ప్రదర్శనలు, భారతదేశ గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఇతర కళాత్మక ప్రదర్శనలతో సహా భారతీయ సాంప్రదాయ సాంస్కృతిక ప్రదర్శనలను ప్రదర్శించారు. 

భారతీయ-బ్రాండెడ్ ఉత్పత్తులపై అద్భుతమైన తగ్గింపులు, ఆఫర్‌లను అందజేశారు. భారతీయ చీరలు, చురిదార్లపై 'బై 2 గెట్ 1 ఫ్రీ' ఆఫర్ ను అందిస్తున్నారు.   ఆగస్టు 13 నుండి 19వరకు సభ్యులు కువైట్ ఎయిర్‌వేస్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ప్రోమో కోడ్ LULU22 ఉపయోగించి బుకింగ్‌లపై 12% తగ్గింపును పొందవచ్చు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com