సీఎం కేసీఆర్ సంతోషం..
- July 17, 2016
టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో వివిధ అంశాలపై జరుగుతున్న చర్చల్లో పాల్గొనడంపైనా, రాష్ర్టానికి సంబంధించిన అంశాలను పార్లమెంటు వేదికగా కేంద్రం దృష్టికి తీసుకుపోవడంపైనా సీఎం కే చంద్రశేఖర్‌రావు సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలను, డిమాండ్లను కూడా మరింతగా గుర్తించి వాటిని కూడా నెరవేర్చుకునే విధంగా పనితీరును మెరుగుపర్చుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన సమావేశంలో పార్లమెంట్లో అనుసరించాల్సిన వైఖరితోపాటు ఇప్పటివరకూ వ్యవహరించిన తీరుపై సమీక్ష జరిగింది. రాష్ట్ర అవసరాల కోసం వివిధ మంత్రిత్వశాఖలకు సంబంధించిన అంశాలను గుర్తించి వాటిపై నిత్యం ఆయా మంత్రిత్వశాఖలను సంప్రదించాలని కేసీఆర్ సూచించారు. ఈ విధంగా రాష్ట్ర అవసరాలను నెరవేర్చుకోడానికి ఎంపీలు సబ్‌గ్రూపులుగా ఏర్పడి మన అవసరాలను తీర్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. తొలిసారీ ఎంపీలు అయినవారు సీనియర్ల నుంచి సూచనలు, సలహాలు తీసుకుని పని చేయాలని, ఆసక్తి ఉన్న అంశాలపై దృష్టి పెట్టి పరిణతి పొందాలని కేసీఆర్ సూచించారు. -ప్రతి మెమొరాండం రికార్డు కావాలిమన రాష్ర్టానికి సంబంధించిన సమస్యలపై ఆయా మంత్రిత్వశాఖలతో సంప్రదింపులు జరుపుతూ విజ్ఞాపనపత్రాలు అందజేస్తూ ఉంటారని, ఈ ప్రతులను విధిగా పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపి రికార్డుల్లో భద్రపర్చాలని కూడా కేసీఆర్ ఎంపీలకు సూచించారు. టీఆర్ఎస్ ఎంపీల బలం పెరిగినందున పార్లమెంటు నిబంధనల ప్రకారం టీఆర్ఎస్కు 1200 చ.మీ. విస్తీర్ణం కలిగిన బంగళా పార్టీ కార్యాలయ అవసరాల నిమిత్తం ఢిల్లీలో కేటాయించబడుతుంది కాబట్టి దీనిపై దృష్టి పెట్టాలని కేసీఆర్ సూచించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







