పేద వైద్య విద్యార్థినికి జయలలిత ఆర్థిక సాయం
- July 17, 2016
తిరుచ్చి జిల్లాకు చెందిన ఓ నిరుపేద వైద్య విద్యార్థిని చదువుకు ముఖ్యమంత్రి జయలలిత ఆర్థిక సాయం ప్రకటించారు. తిరుచ్చి జిల్లా మేలకుళుమణి గ్రామానికి చెందిన ముత్తువీరన్, మలర్కొడి దంపతుల కుమార్తె బృందాదేవికి తిరువారూర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతుండటంతో కూలి పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి తనను చదివించడం అసాధ్యమని, అందువల్ల తన చదువుకు ఆర్థిక సాయం అందించాలని కోరుతూ ముఖ్యమంత్రి జయలలితకు బృందాదేవి ఓ లేఖ రాశారు. దీనిపై స్పందించిన జయలలిత ఆ విద్యార్థిని చదువుకయ్యే ఖర్చును పూర్తిగా భరించడంతో పాటు తొలి ఏడాది విద్యా ఫీజు, హాస్టల్ ఫీజు, పుస్తకాల ఫీజు నిమిత్తతం రూ.50 వేలు నగదును 'పురట్చి తలైవి అమ్మ బెస్ట్ ఛారిటబుల్ ట్రస్ట్' ద్వారా అందించనున్నట్లు ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







