సహజీవనం మహిళలకి క్షేమం కాదు: కంగనా
- August 16, 2025
బాలీవుడ్ నటి, ప్రస్తుత ఎంపీ కంగనా రనౌత్ ఎప్పుడూ తన మాటలతో సంచలనం రేపుతుంటారు. బహిరంగ వేదికలపై తనదైన శైలిలో ధైర్యంగా మాట్లాడటం, సమాజంలోని సమస్యలను నేరుగా చూపించడం వల్ల ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్యలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.కంగనా (Kangana Ranaut) మాట్లాడుతూ, పెళ్లయిన పురుషులతో సంబంధాల విషయంలో సమాజం ఎల్లప్పుడూ మహిళలపైనే నిందలు మోపుతుందని స్పష్టం చేశారు. తన కెరీర్‌ను, భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని కృషి చేసే యువతులు కొన్నిసార్లు పెళ్లయిన, పిల్లలు ఉన్న పురుషుల ఆకర్షణకు గురయ్యే పరిస్థితులు వస్తాయని ఆమె తెలిపారు. అలాంటి సందర్భాల్లో సమాజం ఆ పురుషుడి తప్పును విస్మరించి, కేవలం ఆ అమ్మాయి మీదే వేలెత్తి చూపడం అన్యాయం అని విమర్శించారు.”ఎదిగే వయసులో ఉన్న అమ్మాయిలతో పెళ్లయిన వ్యక్తి సంబంధం పెట్టుకోవాలని చూస్తే, అది అతని తప్పు కాదా? కానీ నింద మాత్రం అమ్మాయి మీదే వేస్తారు” అని ఆమె పేర్కొన్నారు.
డేటింగ్ యాప్‌ల వాడకంపై కూడా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు
అదేవిధంగా, ఆధునిక డేటింగ్ యాప్ (dating app) ల వాడకంపై కూడా ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాటిని “సమాజంలోని మురికి కాలువలు”గా అభివర్ణించారు. ఆత్మవిశ్వాసం కొరవడిన వారు, ఇతరుల గుర్తింపు కోసం ఆరాటపడే వారే ఇలాంటి యాప్‌లను ఆశ్రయిస్తారని ఆమె విమర్శించారు. యువత తమ జీవిత భాగస్వాములను చదువుకునే రోజుల్లో గానీ, పెద్దలు కుదిర్చిన వివాహాల ద్వారా గానీ ఎంచుకోవడం ఉత్తమమని ఆమె సూచించారు.లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లు మహిళలకు ఏమాత్రం సురక్షితం కావని కంగనా స్పష్టం చేశారు. ఇలాంటి సహజీవనంలో అమ్మాయి గర్భం దాల్చితే కుటుంబం నుంచి ఎలాంటి మద్దతు లభించదని, దీనివల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆమె హెచ్చరించారు. మొత్తంగా ఆధునిక సంబంధాల కన్నా సంప్రదాయ పద్ధతులే శ్రేయస్కరమనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి