బహ్రెయిన్ లో ఈవినింగ్ సెకండరీ స్కూల్ కోసం రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- August 17, 2025
మనమా: 2025/2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈవినింగ్ సెకండరీ స్కూల్ ప్రోగ్రామ్స్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని బహ్రెయిన్ విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆగస్టు 17న రిజిస్ట్రేషన్ ప్రారంభమై.. 28వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు. దరఖాస్తులను మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ ను అప్ లోడ్ చేయాలని, అందుబాటులో ఉన్న సీట్లను సామర్థ్యం ఆధారంగా భర్తీ చేయనున్నట్టు తెలిపింది. దరఖాస్తుదారులు తమ పత్రాలను షేక్ ఇసా బిన్ అలీ సమాంతర సెకండరీ ఎడ్యుకేషన్ సెంటర్ వద్ద అధికారులకు సమర్పించాలన్నారు. కాగా, మహిళా దరఖాస్తుదారులు తమ అప్లికేషన్లను రిఫా వెస్ట్ సమాంతర సెకండరీ ఎడ్యుకేషన్ సెంటర్ మెయిల్ కు పంపాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 17896955, 17896927, 17896922, లేదా 17897274 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..