ఒమన్‌లో 8 మిలియన్లకు చేరుకున్న మొబైల్ సబ్స్క్రిప్షన్లు..!!
- August 17, 2025
మస్కట్: ఒమన్‌లో మొత్తం మొబైల్ టెలికాం సబ్స్క్రిప్షన్ల సంఖ్య జూన్ చివరి నాటికి 8 మిలియన్లు దాటింది. గతేడాదితో పోలిస్తే ఇది 15.7 శాతం పెరుగుదలను నమోదు చేసింది. జూన్ 2025 చివరి నాటికి యాక్టివ్ మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రిప్షన్ల సంఖ్య 5,516,530కి పెరిగిందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ తాజా లెక్కులు చెప్పాయి.
అదే సమయంలో యాక్టివ్ పోస్ట్‌పెయిడ్ మొబైల్ సబ్స్క్రిప్షన్లు 5.3 శాతం పెరిగి 1,236,561కి చేరుకున్నాయి. యాక్టివ్ ప్రీపెయిడ్ మొబైల్ సబ్స్క్రిప్షన్లు కూడా 3.6 శాతం పెరిగి 5,236,191 సబ్స్క్రిప్షన్లకు చేరుకున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సబ్స్క్రిప్షన్లు 118.6 శాతంతో అసాధారణ వృద్ధిని నమోదు చేశాయి. జూన్ 2025 చివరి నాటికి 1,560,256 సబ్స్క్రిప్షన్లకు చేరుకున్నాయి.
మరోవైపు యాక్టివ్ ఫిక్స్డ్ బ్రాడ్‌బ్యాండ్ సబ్స్క్రిప్షన్లు 2.2 శాతం పెరిగి, 588,477 సబ్స్క్రిప్షన్లకు చేరుకున్నాయి. ఫైబర్ ఆప్టిక్ సబ్స్క్రిప్షన్లు 10.3 శాతం పెరిగి, 339,309 సబ్స్క్రిప్షన్లకు చేరుకున్నాయి. అయితే ఫిక్స్డ్ 5G సబ్స్క్రిప్షన్లు 1.5 శాతం పెరిగి 215,434 కు చేరుకున్నాయి.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!