ఏపీలో రానున్న 24 గంటల్లో వాయుగుండం..
- August 17, 2025
అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. ప్రస్తుతం ఇది పశ్చిమమధ్య, వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో కేంద్రీకృతమై ఉందని అధికారులు తెలిపారు.
ప్రస్తుతం వాయువ్య దిశగా కదులుతున్న ఈ అల్పపీడనం మంగళవారం మధ్యాహ్నానికి ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీని ప్రభావంతో తీర ఆంధ్రలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు.
ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ హెచ్చరించింది. అందువల్ల మత్స్యకారులు ఎవరూ సముద్ర వేటకు వెళ్లకూడదని స్పష్టమైన సూచనలు ఇచ్చింది. ఇప్పటికే తీరప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
నదులు, వాగులు పొంగిపొర్లే ప్రమాదం ఉన్నందున లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ప్రజల ప్రాణ భద్రతే ప్రధానం కాబట్టి అధికారులు, స్థానిక యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని APSDMA (ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ) స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి