కువైట్లోని 'అవర్ లేడీ ఆఫ్ అరేబియా' చర్చి హోదా పెంపు..!!
- August 19, 2025
కువైట్: కువైట్ లోని అహ్మదిలోని అవర్ లేడీ ఆఫ్ అరేబియా చర్చిని మైనర్ బాసిలికా హోదాకు వాటికన్ పెంచింది ఈ గౌరవాన్ని పొందిన అరేబియా గల్ఫ్ ప్రాంతంలో ఇది మొదటి చర్చిగా నిలిచింది. ఈ నిర్ణయాన్ని ఒక చారిత్రాత్మక మైలురాయిగా కువైట్లోని అపోస్టోలిక్ వికార్, బిషప్ యూజీన్ మార్టిన్ నుజెంట్ అభివర్ణించారు. ఈ చర్చి విశ్వాసం, ఐక్యతకు దారిచూపే దీపంగా ఉంటుందని, మత సామరస్యానికి చిహ్నంగా పనిచేస్తుందని నుజెంట్ తెలిపారు.
1949లో పోప్ పియస్ XII ద్వారా ఆశీర్వాం పొందిన.. 2011లో పోప్ బెనెడిక్ట్ XVI తరపున కిరీటం పొందిన అవర్ లేడీ ఆఫ్ అరేబియా విగ్రహం చర్చిలో ఉంది. అవర్ లేడీ ఆఫ్ అరేబియా చర్చి గల్ఫ్ ప్రాంతంలో మొట్టమొదటి మైనర్ బాసిలికాగా గుర్తింపు పొందనుంది.
తాజా వార్తలు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్