అమెరికా: ఆరువేలకు పైగా విదేశీ విద్యార్థుల వీసాలు రద్దు
- August 19, 2025
అమెరికా: ట్రంప్ ఏది చేసినా ఓ సంచలమే అవుతున్నది. రెండవసారి అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచే విదేశీయులకు చుక్కలు చూపిస్తున్నారు.వలసవాదుల పై ఉక్కుపాదం మోపిన ట్రంప్ సర్కార్ మరోసారి విదేశీ విద్యార్థులకు భారీ షాక్ ఇచ్చింది. అమెరికా ప్రభుత్వం 6 వేల మందికి పైగా విదేశీ విద్యార్థుల వీసాలను రద్దు చేసింది.ఈ నిర్ణయం వల్ల వేలాది మంది విద్యార్థులు, ముఖ్యంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ వీసాల రద్దు వెనుక ఉన్న ప్రధాన కారణాలను అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. దాదాపు 4వేల వీసాలను విద్యార్థులు అమెరికా చట్టాలను ఉల్లంఘించారన్న కారణంతో రద్దు చేశారు. ఈ నేరాల్లో ఎక్కువగా దాడులు, డ్రక్ అండ్ డ్రైవ్, దొంగతనం వంటి చిన్నచిన్న నేరాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. మరో రెండు నుంచిమూడువందల వీసాలను టెర్రరిస్ట్ గ్రూపులకు మద్దతు ఇస్తున్నారన్న ఆరోపణలతో రద్దు చేశారు. అయితే, ఏ గ్రూపులకు మద్దతు ఇచ్చారనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.
కాగా అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులపై కటినమైన నిఘా ఉంచడానికి, వీసాలను పటిష్టంగా పరిశీలించడానికి ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం
తీసుకుంది. సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించడం, పూర్తిస్థాయి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయడం వంటి చర్యలు ఈ విధానంలో భాగం. ఈ కఠిన నిబంధనల వల్ల
ఎంతోమంది విద్యార్థులు, ముఖ్యంగా పాలస్తీనా హక్కులకు మద్దతుగా ఆందోళనల్లో పాల్గొన్నవారు ఇబ్బందులు పడుతున్నారు.
కాగా ట్రంప్ వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపుతూ, కఠిన చర్యలు తీసుకోవడం వల్ల అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావాన్నిచూపుతున్నది. ప్రముఖ యూనివర్సిటీలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎలాంటి కారణాలు చూపకుండా, చిన్నపాటి తప్పులకు కూడా వీసాలు రద్దు చేయడంసరికాదని యూనివర్సిటీలు అంటున్నాయి. ఈ నిర్ణయాలు అమెరికాలో విద్యాభ్యాసం పట్ల అంతర్జాతీయ విద్యార్థులకున్న ఆసక్తిని తగ్గిస్తాయని, అమెరికా ప్రతిష్టకు భంగంకలిగిస్తాయని విద్యాసంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఈ నిర్ణయాలను సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కష్టపడి చదివి, డాలర్లను సంపాదించాలనే ఆశతో శ్రమిస్తున్న విద్యార్థులకు ట్రంప్ విధానాలు కొరగాని కొయ్యగా మారాయి.
తాజా వార్తలు
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్