ఖతార్ లో హెల్త్ ఇన్స్పెక్షన్ విభాగం స్పెషల్ డ్రైవ్స్..!!
- August 19, 2025
దోహా: ఖతార్ లో మున్సిపల్ కంట్రోల్ డిపార్ట్మెంట్ హెల్త్ ఇన్స్పెక్షన్ విభాగం స్పెషల్ డ్రైవ్స్ చేపట్టింది. అల్ షమల్ మునిసిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాలలో 710 ఆహార సంస్థలను పరిశీలించారు. కస్టమర్లకు అందించే ఫుడ్ ఇతర ఆహార పదార్థాల నాణ్యతను చెక్ చేసేందుకు శాంపిల్స్ సేకరించి ల్యాబ్ లకు పంపారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఫుడ్ కోర్టులకు నోటీసులు జారీ చేశారు. వినియోగానికి పనికిరాని ఆహార పదార్థాలను సీజ్ చేశారు. ఫుడ్ వినియోగంపై అవగాహన కల్పించారు.
నాన్ వెజ్ విక్రయాలపై స్పెషల్ ఫోకస్ చేశారు. పబ్లిక్ స్లాటర్హౌస్లను తనిఖీ చేశారు. ఆరోగ్య భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేని దాదాపు 300 కిలోగ్రాముల మాంసాన్ని సీజ్ చేశారు. ఆహార సంబంధిత అవుల్ లెంట్లలో నాణ్యత ప్రమాణాలను పరిశీలించడంతోపాటు ప్రజలలో ఆహార పరిశుభ్రతపై అవగాహన పెంచేందుకు ఈ స్పెషల్ డ్రైవ్ ఉపయోగపడిందని అధికారులు తెలిపారు. వీటితోపాటు పబ్లిక్ ప్లేస్ లలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా.. ఎలుకల నియంత్రణకు రసాయనాలను స్ప్రే చేశారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







