‘స్టాలిన్’ రీ రిలీజ్ ట్రైలర్ విడుదల
- August 19, 2025
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మర్చిపోలేని చిత్రాల్లో స్టాలిన్ ఒకటి. ఇప్పుడు ఈ చిత్రం మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా, ఆగస్టు 22న ఈ సినిమాను 4K వెర్షన్లో రీ-రిలీజ్ చేయనున్నారు.ఈ సందర్భంగా చిత్ర బృందం స్టాలిన్ 4K ట్రైలర్ మంగళవారం విడుదల చేసింది. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో హల్చల్ అయింది. మెగా అభిమానుల్లో ఇది కొత్త ఉత్సాహాన్ని నింపింది.ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 2006లో ఈ సినిమా విడుదలైంది. విడుదలైన వెంటనే ఈ చిత్రం బాక్సాఫీస్‌ను శాసించింది. మంచి సామాజిక సందేశానికి యాక్షన్, ఎమోషన్స్ మేళవించి మురుగదాస్ ఓ హార్ట్‌టచింగ్ కథను అందించారు.చిరంజీవి పోషించిన స్టాలిన్ పాత్రకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ముఖ్యంగా, సినిమాలో ఆయన పలికిన కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఇప్పటికీ అభిమానుల చెవిలో మోగుతూనే ఉన్నాయి.
తాజాగా విడుదలైన 4K ట్రైలర్ చూస్తేనే Goosebumps వస్తున్నాయి. మెరుగైన విజువల్స్, డాల్బీ ఆడియో క్వాలిటీతో సినిమాకు మరో లెవల్ ఆడ్ అయింది. యాక్షన్ సన్నివేశాలు, చిరంజీవి డైలాగ్స్ మళ్లీ థియేటర్లలో అదే మాదిరిగా స్పందన తెచ్చే అవకాశం కనిపిస్తోంది.ఈ చిత్రాన్ని చిరంజీవి సోదరుడు నాగబాబు నిర్మించగా, హీరోయిన్గా త్రిష కనిపించింది. ప్రకాశ్ రాజ్ విలన్‌గా తన స్టైల్లో మెప్పించగా, ఖుష్బూ కీలక పాత్రలో కనిపించారు. కుటుంబ ప్రేక్షకులకు కూడా ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది.సినీ విశ్లేషకులు చెబుతున్నట్లు అయితే, ఈ రీ-రిలీజ్ కూడా మంచి వసూళ్లు సాధించే ఛాన్స్ ఉంది. థియేటర్లలో మళ్లీ చిరంజీవి కనిపిస్తాడని, ఫ్యాన్స్ ఇప్పటికే టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. ట్రైలర్ రిలీజ్‌తోనే సెన్సేషన్ క్రియేట్ అవ్వడం చూస్తే, రిలీజ్ రోజున హౌస్‌ఫుల్స్ ఖాయం అంటున్నారు.
ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ సందర్భంగా స్టాలిన్ రీ-రిలీజ్ ఓ స్పెషల్ ట్రీట్‌గా మారబోతోంది. మెగా ఫ్యాన్స్ చిరు బర్త్‌డేను థియేటర్ల్లో జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు.ఈ రీ-రిలీజ్ సినిమాకే కాదు, చిరంజీవి బ్రాండ్‌కే ఓ గుర్తుగా నిలవనుంది.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!