ఫిల్మ్ ఛాంబర్ సమస్యలను చర్చించి పరిష్కారం చూపాలని సీఎం రేవంత్ ఆదేశం
- August 20, 2025
హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద సంక్షోభం నెలకొంది. ఫిల్మ్ వర్కర్స్ ఫెడరేషన్ పిలుపుతో 17 రోజులుగా కొనసాగుతోన్న సమ్మె కారణంగా అన్ని షూటింగులు పూర్తిగా ఆగిపోయాయి. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా ప్రతి సినిమా ప్రాజెక్ట్ నిలిచిపోవడం వల్ల నిర్మాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సమ్మె వెనుక ప్రధాన కారణం వేతనాల పెంపు. కార్మికులు తమ వేతనాలను 30 శాతం మేర పెంచాలని పట్టుబడుతుండగా, ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న నిర్మాతలు ఆ డిమాండ్‌ను నెరవేర్చడం సాధ్యం కాదని చెబుతున్నారు.ఇప్పటికే పలుమార్లు ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు సమావేశమైనా ఎటువంటి పరిష్కారం దొరకలేదు. ప్రతి చర్చా విఫలమవుతుండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ముందుకు వచ్చి మధ్యవర్తిత్వం చేసినా ఎటువంటి ఫలితం రాలేదు. సమ్మె విషయంలో ఎవరూ వెనక్కి తగ్గకపోవడంతో ఇరుపక్షాల మధ్య దూరం మరింత పెరిగింది.
పరిశ్రమలో సీనియర్లు “ఇలాంటి సమయంలో దాసరి నారాయణరావు లాంటి నేతృత్వం ఉంటే సమస్యలు సులభంగా పరిష్కరమయ్యేవి” అని వ్యాఖ్యానిస్తున్నారు.ఇకపోతే సమ్మె కారణంగా నిర్మాతలకు మాత్రమే కాకుండా, కొత్తగా షూటింగ్‌కి సిద్ధమైన చిన్న సినిమాలకు, సీరియల్స్‌కూ నష్టం కలుగుతోంది. వందలాది మంది చిన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, డైలీ వేజ్ వర్కర్స్ నిరుద్యోగులుగా మారారు. రోజువారీ ఆదాయంపై బతికే కార్మికుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.అసలు ఈ సమ్మె ఎన్నాళ్లు కొనసాగుతుంది.. పరిష్కారం దొరుకుతుందాం.. లేదా అన్న సందిగ్థత నెలకొన్న వేళ తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ నాయకులతో చర్చించి సమస్యకు పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఆదేశించారు. గత రెండు వారాలుగా కొనసాగుతోన్న ఈ సమ్మె రాష్ట్ర సినిమా పాలసీపై తీవ్ర ప్రభావం చూపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ని సినిమా హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ ఆలోచనకు సినీ కార్మికుల సమ్మె పెద్ద అడ్డంకిగా మారిందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి