సెప్టెంబర్ 23 వరకు భారత్ విమానాలకు పాక్ గగనతల నిషేధం
- August 21, 2025
భారత్-పాకిస్తాన్ లమధ్య జరిగిన ఆపరేషన్ సిందూర్ యుద్ధంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.దీంతో మనదేశం పాకిస్తాన్వి మానాలపై గగనతల నిషేధాన్ని విధించింది. దీంతో పాకిస్తాన్ కూడా భారత విమానాలపై ఉన్న గగనతల నిషేధాన్ని విధిస్తున్నది. తాజాగా ఈ నిషేధాన్ని సెప్టెంబర్ 23 వరకు పొడుగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పహల్గాం దాడితో రెండుదేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తలు పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 23న ఒక నెలపాటు భారత విమానాలు ఏవీ తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాక్ నిషేధం విధించింది. దీనికి ప్రతీకరంగా ఏప్రిల్ 30న పాక్ విమానాలు ఏవీ భారత గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. అప్పటి నుంచి పాకిస్తాన్ నిషేధం గడువును పెంచుతూనే ఉంది. తాజాగా పాక్ మరోసారి ఈ నిషేధాన్ని ఒకనెలపాటు పొడిగించింది. దీని క్రారం పాకిస్తాన్ఎ యిర్ లైన్‌కు చెందిన విమానాలతోపాటు, ఆ దేశ సైనిక విమానాలు, లీజుకు తీసుకున్న విమానాలు కూడా భారత గగనతలంలో ప్రవేశించడానికి అవకాశం లేదు.
భారత విమానాలపై గగనతల నిషేధాన్ని విధించడం విధించడం వల్ల పాక్ ఆర్థికంగా నష్టపోయినట్లు తెలుస్తోంది. ఆగస్టులో పాక్ రక్షణ మంత్రిత్వశాఖ సమర్పించిన నివేదిక ప్రకారం, ఎయిర్‌స్పేస్ మూసివేత వల్ల ఆ దేశానికి దాదాపు రూ.126 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అంతేకాక ఏప్రిల్ 24 నుంచి జూన్ 20 వరకు పాకిస్తాన్ తమ గగనతలాన్ని మూసివేయడంతో 4.10 బిలియన్ల పాకిస్తాన్ రూపాయలు (ఇండియన్ కరెన్సీలో రూ.126 కోట్లు వాటిల్లిందని పాక్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ కూడా పేరొకింది. పహల్గాంలో 26మందిని పొట్టన పెట్టుకున్న పాక్ ఉగ్రదాడిపై పాకిస్తాన్ ఇప్పటికీ ఈ నేరం తమది కాదని బుకాయిస్తూనే ఉంది. భారతదేశం ఎన్నో ఆధారాలను ప్రపంచ దేశాలకు చూపిస్తున్నా పాక్ మాత్రం పహల్గాం దాడులతో తమకు సంబంధం లేదని అబద్దాలు చెబుతున్నది. అమెరికా వంటి దేశాలు ఈ దాడికి పాకిస్తాన్ దే బాధ్యత అని ఘటాపధంగా అంటున్నా పాక్ మాత్రం తన వైఖరిని మార్చుకోవడం లేదు.
తాజా వార్తలు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి