మహిళా కమిషన్‌ సభ్యులుగా పీవీ సింధు, మహేశ్‌భగవత్‌

- August 21, 2025 , by Maagulf
మహిళా కమిషన్‌ సభ్యులుగా పీవీ సింధు, మహేశ్‌భగవత్‌

హైదరాబాద్: జాతీయ మహిళా కమిషన్‌ (NCW) సలహా కమిటీ-2025 సభ్యులుగా ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, తెలంగాణ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ మహేశ్‌ భగవత్‌లు నియమితులయ్యారు.ఈ నియామకానికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల అయింది.మహిళల సంక్షేమం, భద్రతకు సంబంధించిన వివిధ అంశాలపై కమిషన్‌కు సలహాలు, సూచనలు ఇవ్వడం ఈ సలహా కమిటీ ప్రధాన విధి. పీవీ సింధు క్రీడాకారిణిగా ఆమె దేశానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చారు. ఆమె మహిళా సాధికారతకు ఒక చిహ్నంగా నిలిచారు. మహేశ్ భగవత్ ఐపీఎస్ అధికారిగా, తెలంగాణలో మహిళల భద్రత కోసం, ముఖ్యంగా మానవ అక్రమ రవాణాను అరికట్టడంలో ఆయన చేసిన కృషికి గాను విశేష గుర్తింపు పొందారు. వీరి నియామకం వల్ల మహిళా కమిషన్‌కు వారి అనుభవం, నిపుణత ఎంతగానో ఉపయోగపడతాయని కమిషన్ భావిస్తోంది. మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ విజయా కిశోర్‌ రహాట్కర్‌ ఆధ్వర్యంలో నడిచే ఈ కమిటీలో మొత్తం 21 మందిని సభ్యులుగా నియమించారు. ఇందులో ఐఐటీ మద్రాస్‌ డైరెక్టర్‌ వి.కామకోటి, ఫిక్కి ప్రెసిడెంట్‌ హర్షవర్ధన్‌ అగర్వాల్‌కూ ఇందులో స్థానం కల్పించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com