వాణిజ్యం , పెట్టుబడులపై ఒమన్, లెబనాన్ చర్చలు..!!
- August 22, 2025
మస్కట్: వాణిజ్యం , పెట్టుబడుల సహకారంపై ఒమన్, లెబనాన్ చర్చలు జరిపాయి. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఒమన్ వాణిజ్య, పెట్టుబడి ప్రమోషన్ మంత్రి ఖైస్ మొహమ్మద్ అల్ యూసఫ్.. లెబనాన్ ఆర్థిక మరియు వాణిజ్య మంత్రి డాక్టర్ అమెర్ బిసాట్తో సమావేశమయ్యారు.
రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడి సహకారాన్ని బలోపేతం చేయడంతోపాటు ఇతర రంగాల్లో భాగస్వామ్యం కోసం కొత్త మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు. పెట్టుబడులను పెంచడం, పరిశ్రమలను అభివృద్ధి చేయడం , లాజిస్టిక్స్ వంటి అనేక కీలక రంగాలలో సహకారానికి ఉన్న అవకాశాలపై ఇద్దరు మంత్రులు సమీక్షించారు.
వాణిజ్యం, పర్యాటకాన్ని పెంచేందుకు వీలుగా మస్కట్ - బీరుట్ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరు పక్షాలు నిర్ణయించాయి. ఈ సమావేశంలో లెబనాన్లో ఒమన్ రాయబారి డాక్టర్ అహ్మద్ మొహమ్మద్ అల్ సైదితో పాటు రెండు దేశాల అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!
- బర్కా కారవాన్స్ లో అగ్నిప్రమాదం..!!
- వాడి హనిఫాలో రియల్ భూమ్.. సస్పెన్షన్ ఎత్తివేత..!!
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..