మనీలాండరింగ్ కేసులో దోషులుగా 18 మంది..!!
- August 22, 2025
యూఏఈ: దుబాయ్ అనే లా సంస్థను లక్ష్యంగా చేసుకుని మల్టీ-మిలియన్ల దిర్హామ్‌ల దుర్వినియోగమైన మనీలాండరింగ్ పథకంలో వివిధ దేశాలకు చెందిన 18 మందిని దుబాయ్‌లోని కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ కోర్టు దోషులుగా తేల్చింది. నిందితులు సంస్థ నుండి మొత్తం 185 మిలియన్ దిర్హామ్‌లను దొంగిలించారని తెలిపింది. యూఏఈతోపాటు వివిధ దేశాలలో నకిలీ కంపెనీలను ఏర్పాటు చేయడం ద్వారా నిందితులు మనీలాండరింగ్ కు పాల్పడ్డారు. అదేసమయంలో దొంగిలించిన డబ్బును మూడు షెల్ కంపెనీల ద్వారా లాండరింగ్ చేసినందుకు కూడా ఈ బృందం సభ్యులను కోర్టు దోషిగా నిర్ధారించింది.
నలుగురికి మూడు సంవత్సరాల జైలు శిక్ష, తరువాత బహిష్కరణ, మిగిలిన వారికి ఒక సంవత్సరం జైలు శిక్ష మరియు బహిష్కరణ వేటు వేశారు. ఇద్దరికి ఒక్కొక్కరికి దిర్హామ్‌లు 20,000 జరిమానా విధించగా, ఈ పథకంతో సంబంధం ఉన్న మూడు కంపెనీలకు ఒక్కింటికి 500,000 దిర్హామ్‌లు జరిమానా విధించారు. తగినంత సాక్ష్యాలు లేనందున మరో నలుగురు వ్యక్తులను నిర్దోషులుగా విడుదల చేశారు.
నిందితుల ముఠా తన క్లయింట్లను మోసం చేయడానికి నకిలీ పత్రాలు, నకిలీ ఇమెయిల్ చిరునామాలు, లా ఫర్మ్ వలె నకిలీ స్టేషనరీలను ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వారు సంస్థ క్లయింట్ డేటాబేస్‌ను కాపీ చేశారని, సంస్థతో లావాదేవీలు కలిగి ఉన్న అంతర్జాతీయ కంపెనీలను సంప్రదించారని,వారి స్వంత కంపెనీల నియంత్రణలో ఉన్న ఖాతాల్లోకి చెల్లింపులను మళ్లించారని కోర్టు తన తీర్పు వెల్లడించింది. అలాగే, దోషులుగా తేలిన నిందితులందరి నుండి దిర్హామ్‌లు 113.65 మిలియన్ల విలువైన ఆస్తులను జప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, ఈ తీర్పును దుబాయ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ సమర్థించింది.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!