ఖతార్ క్లీనప్ డ్రైవ్: జూలైలో వేల టన్నుల వ్యర్థాలు తొలగింపు..!!

- August 23, 2025 , by Maagulf
ఖతార్ క్లీనప్ డ్రైవ్: జూలైలో వేల టన్నుల వ్యర్థాలు తొలగింపు..!!

దోహా: పట్టణ పరిశుభ్రత మరియు ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడానికి ఖతార్ వ్యాప్తంగా క్లీనప్ డ్రైవ్ చేపట్టారు.  అనేక ఇతర సంస్థలతో సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మునిసిపల్ ప్రాంతాల నుండి 41,959 టన్నులకు పైగా వ్యర్థాలను తొలగించారు. దీంతోపాటు 3,357 దెబ్బతిన్న టైర్లు, 2,469 చనిపోయిన జంతువులను తొలగించారు. వాటితో పాటు వదిలేసిన కార్లు 196, నిర్లక్ష్యంగా వదిలేసిన 61 సైన్ బోర్డులను తొలగించారు. ఈ డ్రైవ్ సందర్భంగా 803 పరిశుభ్రత చట్ట ఉల్లంఘనలను జారీ చేశారు.

ఇక ఖతార్ తీరప్రాంతంలోని బీచ్‌ల నుండి 553.71 టన్నుల సాధారణ వ్యర్థాలను సేకరించారు. ఇందులో 4.34 టన్నుల పునర్వినియోగపరచదగినవి, 163.26 టన్నుల సముద్రపు పాచి, 230.70 టన్నుల కలప వ్యర్థాలు, 9.90 టన్నుల బొగ్గును తొలగించింది. అలాగే సముద్ర జలాల నుంచి 6.64 టన్నుల ఇనుము, 95 ఫిషింగ్ బోనులు, 62 ఫిషింగ్ వలలను స్వాధీనం చేసుకున్నట్లు ఖతార్ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com