ఖైరతాబాద్ గణేష్‌ విగ్రహం నిమజ్జనం ప్రత్యేకత

- August 23, 2025 , by Maagulf
ఖైరతాబాద్ గణేష్‌ విగ్రహం నిమజ్జనం ప్రత్యేకత

హైదరాబాద్: 2025లో వినాయక చవితి ఆగస్టు 27 నుండి సెప్టెంబర్ 6 గణేష్‌ వరకు జరుగుతుంది. పది రోజుల పాటు భక్తులు గణేష్ విగ్రహాలను ఇంట్లో, వీధుల్లో ప్రతిష్టించి పూజలు చేస్తారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

అనంత చతుర్దశి విశిష్టత

భాద్రపద శుక్ల పక్ష చతుర్దశిని అనంత చతుర్దశి అంటారు. ఈరోజున శ్రీమహావిష్ణువును అనంత పద్మనాభ స్వామి రూపంలో పూజిస్తారు. ఈ వ్రతం ఆచరించడం వల్ల కష్టాలు తొలగి, ఆయురారోగ్యాలు, సుఖసంపదలు కలుగుతాయని నమ్మకం. మహాభారతంలో శ్రీకృష్ణుడు కూడా ఈ వ్రతం ప్రాముఖ్యతను వివరించాడు.

హైదరాబాద్ గణేష్ నిమజ్జనం

అనంత చతుర్దశి రోజున గణేష్ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నదులు, చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహం కూడా ఇదే రోజు నిమజ్జనం అవుతుంది. దీంతో ఆ ఏడాది గణేష్ ఉత్సవాలు ముగుస్తాయి.

గమనిక: ఈ సమాచారం శాస్త్రాలు, నిపుణుల అభిప్రాయాల ఆధారంగా మాత్రమే అందించబడింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com