నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నేడు రాజ్యసభకు రాజీనామా..

- July 18, 2016 , by Maagulf
నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నేడు రాజ్యసభకు రాజీనామా..

సీనియర్‌ భాజపా నేత, ఎంపీ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ నేడు రాజ్యసభకు రాజీనామా చేశారు. సిద్ధూ రెండు నెలల క్రితమే నామినేటెడ్‌ ఎంపీగా రాజ్యసభకు ఎంపికయ్యారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్‌ ఆమోదించారు. సిద్ధూ ఆమ్‌ ఆద్మీ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిద్ధూను ప్రకటించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. మాజీ క్రికెటర్‌, గతంలో అమృత్‌సర్‌ లోక్‌సభ ఎంపీ అయిన సిద్ధూను 2014 లోక్‌సభ ఎన్నికల్లో అరుణ్‌ జైట్లీ కోసం అక్కడి నుంచి తప్పించారు. ఆ స్థానం నుంచి జైట్లీ పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. సిద్ధూ 2004 నుంచి 2014 వరకు అమృత్‌సర్‌ ఎంపీ. ఆయన భార్య నవజ్యోత్‌ కౌర్‌ సిద్ధూ కూడా భాజపా సీనియర్‌ నేత, పంజాబ్‌ అసెంబ్లీ ఎమ్మెల్యే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com