ఒమన్ ప్రయాణికులకు సలాం ఎయిర్ బ్రేకింగ్ ఫేర్స్ ఆఫర్..!!
- August 24, 2025
మస్కట్: ఒమన్‌లో తక్కువ ధరకు విమాన సర్వీసులు అందించే సలాం ఎయిర్ తన ఉత్తేజకరమైన “బ్రేకింగ్ ఫేర్స్” ప్రచారాన్ని ప్రారంభించింది. దీని ద్వారా ప్రయాణికులు 19.99 OMR ధరలకు తమకిష్టమైన గమ్యస్థానాలకు ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. మస్కట్ నుండి దోహా, దుబాయ్, అలెగ్జాండ్రియా, కువైట్, దమ్మామ్, హైదరాబాద్, కాలికట్, బెంగళూరు, చెన్నై, జైపూర్, ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ, టెహ్రాన్, షిరాజ్, ఢిల్లీ, సియాల్కోట్ మరియు ముల్తాన్లతో సహా దాని విస్తృత నెట్‌వర్క్‌లోని వివిధ నగరాలకు ప్రయాణించే అవకాశం కల్పిస్తుందని సలాం ఎయిర్ మార్కెటింగ్ హెడ్ ఖాదీజా అల్ కిండి తెలిపారు.
ఈ ఆఫర్ ఆగస్టు 24 నుండి ఆగస్టు 28 వరకు కొనసాగుతుంది. ప్రయాణికులు అక్టోబర్ 1 మరియు నవంబర్ 30 మధ్య తమ ప్రయాణాలను బుక్ చేసుకోవచ్చు. సీట్లు పరిమితంగా ఉన్నాయని, బుకింగ్‌లను సలాంఎయిర్ అధికారిక వెబ్సైట్ www.salamair.com ద్వారా లేదా ఎయిర్‌లైన్ అధీకృత సేల్స్ ఛానెల్‌ల ద్వారా చేసుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!