ఖతార్ 22శాతం పెరిగిన రెసిడెన్సీ అమ్మకాలు..!!

- August 25, 2025 , by Maagulf
ఖతార్ 22శాతం పెరిగిన రెసిడెన్సీ అమ్మకాలు..!!

దోహా: ఖతార్ లో రెసిడెన్సీ అమ్మకాలు 22 శాతం పెరిగాయని కుష్మాన్ మరియు వేక్‌ఫీల్డ్ త్రైమాసిక రియల్ ఎస్టేట్ ఇటీవలి డేటా వెల్లడించింది. లుసైల్ మరియు ది పెర్ల్‌లో బలమైన డిమాండ్ కారణంగా అమ్మకాలు, లీజింగ్ కార్యకలాపాలు రెండింటిలోనూ పెరుగుదల నమోదైంది. 

2025 రెండవ త్రైమాసికంలో (Q2) 798 లావాదేవీలు నమోదు కాగా, 2025 మొదటి త్రైమాసికంలో (Q1) 708 లావాదేవీలు నమోదయ్యాయి. 2024లో ఇదే కాలంతో పోలిస్తే 22 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

లుసైల్ మరియు ది పెర్ల్ ఐలాండ్‌లలో అపార్ట్‌మెంట్ సేల్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ సగటు అమ్మకాల ధరలు వరుసగా చదరపు మీటరుకు QR15,534 మరియు QR14,991 గా ఉన్నాయని నివేదిక తెలిపింది. ఇదే కాలానికి సంబంధించి లీజింగ్ లు 26 శాతం పెరిగాయని పేర్కొంది.  

వివా బహ్రియాలోని సింగిల్ బెడ్ రూమ్ యూనిట్లు ఇప్పుడు నెలకు QR9,000 మరియు QR10,500 మధ్య ఉన్నాయి. అయితే లుసైల్ మెరీనాలో ధరలు QR8,000 నుండి QR9,000 వరకు ఉన్నాయి. అల్ సద్‌లో QR5,500 నుండి QR6,500 వరకు లీజు ధరలు ఉన్నాయి. 

అల్ వాబ్, అల్ దుహైల్, అల్ మార్ఖియా, అబు హమౌర్ మరియు ఒనైజా వంటి ప్రాంతాలు 95 శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీలను నమోదు చేస్తున్నాయని నివేదికలో వెల్లడించారు.  దోహా మరియు అల్ వుకైర్‌లోని శివారు ప్రాంతాలలో QR2.3 మిలియన్ మరియు QR5 మిలియన్ మధ్య ధరల్లో విల్లాలు లభ్యమవుతున్నాయి.      

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com