బహ్రెయిన్ లో బిల్డింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు AI వ్యవస్థ..!!

- August 25, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో బిల్డింగ్ ఉల్లంఘనల పర్యవేక్షణకు AI వ్యవస్థ..!!

మనామా: బహ్రెయిన్ లోని ప్రభుత్వ కార్యకలాపాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రవేశపెట్టే దిశగా ఒక ప్రధాన అడుగు పడింది.  బిల్డింగ్ ఉల్లంఘనలు మరియు మార్పులను గుర్తించడానికి AI-ఆధారిత వ్యవస్థను అమలు చేయడానికి వీలుగా గ్లోబల్ కంపెనీ ఐటోస్కీతో సర్వే మరియు ల్యాండ్ రిజిస్ట్రేషన్ అథారిటీ ఒప్పందం చేసుకుంది. 

ప్రభుత్వ సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి ఈ వ్యవస్థ తోడ్పడుతుందని అథారిటీ ఛైర్మన్ ఇంజనీర్ బాసిమ్ బిన్ యాకౌబ్ అల్ హమ్మర్ అన్నారు.  బహ్రెయిన్ అంతటా సహజ మరియు బిల్డింగ్ ప్లాన్ లో మార్పుల సమగ్ర , విశ్వసనీయ పర్యవేక్షణ శాటిలైట్ ఫిక్చర్స్ పై ఆధారపడి పనిచేస్తుందని వెల్లడించారు. ఇది పర్యవేక్షణ సామర్థ్యాన్ని 60% కంటే ఎక్కువకు పెంచుతుందని తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com